
సాక్షి,వనస్థలిపురం(హైదరాబాద్): వార్డుబాయ్ చేసిన తప్పిదంతో పిల్లలు మారిపోయి గందరగోళం నెలకొన్న సంఘటన మంగళవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన జ్యోతి కుటుంబం అల్మాస్‌గూడలో నివాసం ఉంటోంది. జ్యోతి మంగళవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే సిబ్బంది తల్లికి బిడ్డను చూపించారు.
మార్డుకు మార్చే సమయంలో వార్డు బాయ్ రమ్య అనే మహిళకు జన్మించిన మగబిడ్డను జ్యోతి పక్కన పడుకోబెట్టాడు. ఇది గమనించిన జ్యోతి బంధువులు ఆడపిల్ల పుట్టిందని చెప్పి మగ పిల్లాడిని ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించడంతో.. జరిగిన పొరపాటును గుర్తించి ఆడపిల్లను వారికి అప్పగించారు. ఇదేమని జ్యోతి బంధువులు ప్రశ్నించడంతో వార్డు బాయ్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బంధువులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు
Comments
Please login to add a commentAdd a comment