ward boy
-
వార్డుబాయ్ తప్పిదం... ఆడ బిడ్డకు బదులు మగ బిడ్డను ఇవ్వడంతో
సాక్షి,వనస్థలిపురం(హైదరాబాద్): వార్డుబాయ్ చేసిన తప్పిదంతో పిల్లలు మారిపోయి గందరగోళం నెలకొన్న సంఘటన మంగళవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన జ్యోతి కుటుంబం అల్మాస్‌గూడలో నివాసం ఉంటోంది. జ్యోతి మంగళవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే సిబ్బంది తల్లికి బిడ్డను చూపించారు. మార్డుకు మార్చే సమయంలో వార్డు బాయ్ రమ్య అనే మహిళకు జన్మించిన మగబిడ్డను జ్యోతి పక్కన పడుకోబెట్టాడు. ఇది గమనించిన జ్యోతి బంధువులు ఆడపిల్ల పుట్టిందని చెప్పి మగ పిల్లాడిని ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించడంతో.. జరిగిన పొరపాటును గుర్తించి ఆడపిల్లను వారికి అప్పగించారు. ఇదేమని జ్యోతి బంధువులు ప్రశ్నించడంతో వార్డు బాయ్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బంధువులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు -
వార్డుబాయ్ హంగామా.. పెదవికి కుట్టేయమంటే కన్ను కింద కోశాడు
సాక్షి, కరీంనగర్: ఓ వ్యక్తి పెదవి పగిలి వైద్యం కోసం ఆసుపత్రికి రాగా.. మద్యం మత్తులో ఉన్న వార్డుబాయ్ పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కన్ను కింద కోసిన దుర్ఘటన మంగళవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. వివరాల్లో కెళితే.. ప్రమాదంలో పెదవి పగిలిన వ్యక్తి కుట్లు వేయించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. సీవోటీలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్ కుట్లు వేయమని వార్డుబాయ్‌ను పురమాయించాడు. అప్పటికే చిత్తుగా మద్యం సేవించి సీవోటీ వద్ద విధులు నిర్వహించే వార్డుబాయ్ పెదవికి కుట్లు వేయకుండా కన్ను కింది భాగంలో బ్లేడ్‌తో కోసి కొత్త గాయం చేశాడు. దీంతో పేషెంట్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్, నర్సులు పేషెంట్ల బంధువుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరగగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీసేలా వ్యవహరిస్తున్నారని పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సదరు వార్డుబాయ్ గతంలో కూడా చాలాసార్లు మధ్య మత్తులో హల్ చేసిన ఘటనలు ఉన్నాయి. అధికారుల ఉదాసీనత కారణంగానే సదరు వార్డుబాయ్ మద్యం మత్తును వీడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించలేదు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు -
వరెస్ట్ వార్డుబాయ్..!
-
నగ్నంగా ఉంటూ యువతులకు వీడియో కాల్
అతను పేరుకే వార్డు బాయ్.. వ్యవహార శైలి మాత్రం వరెస్ట్ బాయ్‌ని తలపిస్తుంది. తాను నగ్నంగా ఉంటూ వీడియో కాల్ చేస్తాడు. వారు ఫోన్ ఎత్తారో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తాడు.. వస్తావా.. ఆ ఫొటో బయటపెట్టమంటావా’ అంటూ బెదిరింపులకు గురిచేస్తాడు. ఇలా.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు మూడేళ్లలో అతడి వలలో సుమారు 200 మందికి పైగా అమాయక యువతులు బలైపోయారు.. అదే వేటలో ఆ వరెస్ట్ బాయ్ చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ నిందితుడి అకృత్యాలు వెల్లడించారు. నల్లగొండ క్రైం : వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పార్శ అఖిల్ అలియాస్ చందు తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడి చదువును మధ్యలోనే ఆపేశాడు. అయితే ఇతడు సెల్‌ఫోన్ వాడడంలో దిట్ట. జల్సాలకు అలవాటు పడిన అఖిల్ మూడేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట పరిధిలో ఒక హోమ్‌కేర్ సెంటర్లో వార్డుబాయ్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఫోన్ నంబర్లు సేకరించి.. అఖిల్ చాకచక్యంగా హోమ్‌కేర్ సెంటర్లో ఉండే నర్సులు, ఇతర్ర ఉద్యోగాలు చేసే యువతుల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి తాను నగ్నంగా ఉంటూ వీడియో కాల్ చేసేవాడు. వారు ఫోన్ ఎత్తగానే ఆ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకునేవాడు. అవే ఫొటోలను వారికి వాట్సాప్ చేసి బెదిరింపులకు గురిచేసేవాడు. ఇలా మూడేళ్ల కాలంలో సుమారు 200 మందిని వేధించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు వాట్సాప్ డీపీలో ఉన్న ఫొటోతో నకిలీ ఫేస్బుక్ క్రియేట్ చేసి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వారి నుంచి ఫోన్ నంబర్లు సేకరించి వీడియోకాల్ చేసేవాడు. ఫోన్ చేసి మీకో సప్రైజ్ అంటూ వీడియోకాల్ రిసీవ్ చేయాలని చెçప్పడంతో యువతులు ఫోన్ ఎత్తితే నగ్నంగా కనిపిస్తూ తన సెల్ఫోన్లో వీడియోకాల్ రికార్డు, స్క్రీన్‌షాట్ ద్వారా ఫొటోలు తీసుకునేవాడు. స్క్రీన్‌షాట్ ఫోటోలు వాట్సాప్ ద్వారా పంపి తన వద్ద ఫొటోలు వీడియోలు ఉన్నాయని లైంగిక కోరిక తీర్చకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరింపులకు గురిచేసేవాడు. అయితే మృగాడి వేధింపులకు ఎంతో మంది బలైపోగా అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యువతులు వెనుకడుకు వేశారని పోలీసులు విచారణలో తేలింది. పోలీసులకు చిక్కాడు ఇలా.. నల్లగొండ పట్టణంలో ఉంటున్న ఓ వృద్ధ మహిళకు సేవలందించేందుకు సికింద్రాబాద్‌లోని హోమ్‌కేర్ సెంటర్ నుంచి ఓ నర్సు వచ్చింది. అప్పటికే ఫోన్ నంబర్ సేకరించిన అఖిల్ ఆమెను తరచూ వేధిస్తున్నాడు. అతడి అకృత్యాలకు విసిగి వేసారిన బాధితురాలు నల్లగొండలోని షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగలోకి దిగిన సీఐ రాజశేఖర్ పకడ్బందీ వ్యూహాన్ని రచించి అఖిల్‌ను నల్లగొండకు రప్పించారు. ఆ వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎందరో అమాయక యువతులను వేధింపులకు గురిచేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే అఖిల్ సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లను చెడు అలవాట్లకు బానిసకు మారాడు. సంపాదన సరిపోకపోవడంతో ఇలా వక్రమార్గాన్ని ఎంచుకుని అమాయక యువతులు, మైనర్లను వేధింపులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.అయితే ఇతడిపై జంటనగరాల్లోని పలు పోలీస్స్టేషన్లలో దొంగతనాలు, మహిళపై వేధింపుల కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. మహిళల భద్రత కోసం షీటీం పోలీస్‌లు నిరంతరం అందుబాటులో ఉంటారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. వారు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.మహిళలు, యువతులు నిరాశ, నిస్పృహలతో అఘాయిత్యాలకు ఒడిగట్టవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏఎస్పీ నర్మద, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు రాజశేఖర్‌గౌడ్, నిగిడాల సురేష్, సోమిరెడ్డి, శ్రీనివాస్, నర్సింహ,కిరణ్ ఉన్నారు. -
దారుణం: ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై..
సాక్షి, హైదరాబాద్ : ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వార్డ్బాయ్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ 30ఏళ్ల మహిళ డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. డెలివరీ అనంతరం మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను ఐసీయూకు మార్చారు. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న అచ్యుత్ రావ్ అనే వార్డ్బాయ్ ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉన్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొద్దిరోజుల తర్వాత కోలుకున్న బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పేషంట్ అటెండర్‌పై వార్డుబాయ్ అత్యాచారయత్నం
హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ పేషెంట్ అటెండర్‌పై వార్డుబాయ్ అత్యాచారయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ సంఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.