నగ్నంగా ఉంటూ యువతులకు వీడియో కాల్ | Ward Boy Arrested For Harassing Young Girls In Nalgonda | Sakshi
Sakshi News home page

వరెస్ట్‌ వార్డుబాయ్‌..!

Jun 10 2020 8:20 AM | Updated on Jun 10 2020 8:48 AM

Ward Boy Arrested For Harassing Young Girls In Nalgonda - Sakshi

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రంగనాథ్‌ చిత్రంలో ఏఎస్పీ నర్మద, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు

లైంగిక వేధింపులకు గురిచేస్తాడు.. వస్తావా.. ఆ ఫొటో బయటపెట్టమంటావా’...

అతను పేరుకే వార్డు బాయ్‌.. వ్యవహార శైలి మాత్రం వరెస్ట్‌ బాయ్‌ని తలపిస్తుంది. తాను నగ్నంగా ఉంటూ వీడియో కాల్‌ చేస్తాడు. వారు ఫోన్‌ ఎత్తారో వెంటనే స్క్రీన్‌ షాట్‌ తీసుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తాడు.. వస్తావా.. ఆ ఫొటో బయటపెట్టమంటావా’ అంటూ బెదిరింపులకు గురిచేస్తాడు. ఇలా.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు మూడేళ్లలో అతడి వలలో సుమారు 200 మందికి పైగా అమాయక యువతులు బలైపోయారు.. అదే వేటలో ఆ వరెస్ట్‌ బాయ్‌ చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ నిందితుడి అకృత్యాలు వెల్లడించారు.

నల్లగొండ క్రైం : వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పార్శ అఖిల్‌ అలియాస్‌ చందు తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడి చదువును మధ్యలోనే ఆపేశాడు. అయితే ఇతడు సెల్‌ఫోన్‌ వాడడంలో దిట్ట.  జల్సాలకు అలవాటు పడిన అఖిల్‌ మూడేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు.  సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట పరిధిలో ఒక హోమ్‌కేర్‌ సెంటర్లో వార్డుబాయ్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. 

ఫోన్‌ నంబర్లు సేకరించి..
అఖిల్‌ చాకచక్యంగా హోమ్‌కేర్‌ సెంటర్లో ఉండే నర్సులు, ఇతర్ర ఉద్యోగాలు చేసే యువతుల ఫోన్‌ నంబర్లు సేకరించేవాడు. వారికి తాను నగ్నంగా ఉంటూ వీడియో కాల్‌ చేసేవాడు. వారు ఫోన్‌ ఎత్తగానే ఆ వెంటనే స్క్రీన్‌ షాట్‌ తీసుకునేవాడు. అవే ఫొటోలను వారికి వాట్సాప్‌ చేసి బెదిరింపులకు గురిచేసేవాడు. ఇలా మూడేళ్ల కాలంలో సుమారు 200 మందిని వేధించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు వాట్సాప్‌ డీపీలో ఉన్న ఫొటోతో నకిలీ ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేసి అమ్మాయిలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టి వారి నుంచి ఫోన్‌ నంబర్లు సేకరించి వీడియోకాల్‌ చేసేవాడు.

 ఫోన్‌ చేసి మీకో సప్రైజ్‌ అంటూ వీడియోకాల్‌ రిసీవ్‌ చేయాలని చెçప్పడంతో యువతులు ఫోన్‌ ఎత్తితే నగ్నంగా కనిపిస్తూ తన సెల్‌ఫోన్‌లో వీడియోకాల్‌ రికార్డు, స్క్రీన్‌షాట్‌ ద్వారా ఫొటోలు తీసుకునేవాడు. స్క్రీన్‌షాట్‌ ఫోటోలు వాట్సాప్‌ ద్వారా పంపి తన వద్ద ఫొటోలు వీడియోలు ఉన్నాయని లైంగిక కోరిక తీర్చకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరింపులకు గురిచేసేవాడు. అయితే మృగాడి వేధింపులకు ఎంతో మంది బలైపోగా అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యువతులు వెనుకడుకు వేశారని పోలీసులు విచారణలో తేలింది. 
పోలీసులకు 

చిక్కాడు ఇలా..
నల్లగొండ పట్టణంలో ఉంటున్న ఓ వృద్ధ మహిళకు సేవలందించేందుకు సికింద్రాబాద్‌లోని హోమ్‌కేర్‌ సెంటర్‌ నుంచి ఓ నర్సు వచ్చింది. అప్పటికే ఫోన్‌ నంబర్‌ సేకరించిన అఖిల్‌ ఆమెను తరచూ వేధిస్తున్నాడు. అతడి అకృత్యాలకు విసిగి వేసారిన బాధితురాలు నల్లగొండలోని షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగలోకి దిగిన సీఐ రాజశేఖర్‌ పకడ్బందీ వ్యూహాన్ని రచించి అఖిల్‌ను నల్లగొండకు రప్పించారు. ఆ వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎందరో అమాయక యువతులను వేధింపులకు గురిచేసినట్లు ఒప్పుకున్నాడు.

 అయితే అఖిల్‌ సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లను చెడు అలవాట్లకు బానిసకు మారాడు. సంపాదన సరిపోకపోవడంతో ఇలా వక్రమార్గాన్ని ఎంచుకుని అమాయక యువతులు, మైనర్లను వేధింపులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.అయితే ఇతడిపై జంటనగరాల్లోని పలు పోలీస్‌స్టేషన్లలో దొంగతనాలు, మహిళపై వేధింపుల కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. 

నిర్భయంగా పోలీసులకు  ఫిర్యాదు చేయాలి..
మహిళల భద్రత కోసం షీటీం పోలీస్‌లు నిరంతరం అందుబాటులో ఉంటారని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. వారు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు.  సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.మహిళలు, యువతులు నిరాశ, నిస్పృహలతో అఘాయిత్యాలకు ఒడిగట్టవద్దని విజ్ఞప్తి చేశారు.  సమావేశంలో ఏఎస్పీ నర్మద,  డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు రాజశేఖర్‌గౌడ్, నిగిడాల సురేష్, సోమిరెడ్డి, శ్రీనివాస్, నర్సింహ,కిరణ్‌  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement