ఆ శిశువు మృత్యుంజయురాలు.. తల్లి గర్భంలో నుంచి.. | Infant From Mother Womb Throws Away In Truck Accident In Brazil | Sakshi
Sakshi News home page

ఆ శిశువు మృత్యుంజయురాలు.. తల్లి గర్భంలో నుంచి..

Published Mon, Jul 30 2018 12:05 PM | Last Updated on Mon, Jul 30 2018 12:20 PM

Infant From Mother Womb Throws Away In Truck Accident In Brazil - Sakshi

ప్రమాదంలో క్షేమంగా బయటపడ్డ ఆడశిశువు

బ్రెసిలియా :  ఓ ప్రమాదంలో గర్భవతి కడుపులోనుంచి బయటకు ఎగిరిపడ్డ ఓ పసికందు ప్రాణాలతో మిగిలింది. తల్లి ప్రమాదంలో చనిపోయినా ఆమెకు కొద్దిమీటర్ల దూరంలో గడ్డిలో ఎగిరిపడ్డ ఆ పసికందుకు ఏ చిన్నగాయం కాకపోవటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన ఓ ట్రక్కు చెక్క ముక్కలతో ప్రయాణిస్తూ.. కొద్ది దూరం తర్వాత ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఆ సమయంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఓ గర్భవతి కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంది.

దీంతో ట్రక్కులో ఉన్న చెక్కముక్కలు ఆమెపై పడ్డాయి. మహిళ కడుపుపై ఒత్తిడి పడటంతో గర్భంలో ఉన్న శిశువు కడుపులో నుంచి ఎగిరి కొద్ది మీటర్ల దూరంగా గడ్డిలో పడింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించినప్పటికి శిశువు మృత్యుంజయురాలిగా మిగిలింది. ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్న కొద్దిమందికి శిశువు ఏడుపు వినపడింది. మహిళ మృతదేహానికి కొద్ది దూరంలో ఓ ఆడ శిశువును గుర్తించిన వారు పసికందును ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ మహిళకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement