
Enraged Man Kills Girlfriends Two-year Old Daughter: ఇటీవలకాలంలో చాలా రకాల నేరాలు గురించి విని ఉన్నాం. ఆస్తుల కోసం లేక వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు గురించి విన్నాం. కానీ పసిపాప అని కూడ కనికరం లేకుండా పాల కోసం ఏడుస్తోందని కోపంతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ముంబైలోని భయందార్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగింది.
విషయంలోకెళ్తే.. .22 ఏళ్ల పూజా వాఘ్ అనే వివాహిత తన భర్త నుంచి విడాకులు తీసుకుని స్నేహితుడు ఆదిల్ మునావర్ ఖాన్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే ఆమెకు ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె తన తండ్రి వద్ద ఉంటుంది. పైగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకునేటప్పటికీ మూడు నెలల గర్భవతి. ఈ మేరకు ఆమె జనవరి 2020లో సోనాలి అనే పాపకు జన్మనిచ్చింది. అయితే పూజా క్యాటరింగ్ కంపెనీలో పనిచేస్తోంది.
ఒకరోజు ఆమె ఉద్యోగానికి వెళ్లే నిమిత్తం ఆమె ప్రియుడు ఖాన్ వద్ద చిన్నారి సోనాలిని ఉంచి వెళ్లింది. అయితే ఖాన్ ఆ చిన్నారి పాల కోసం ఏడుస్తోందని కోపంతో కొట్టాడు. ఆ తర్వాత ఖాన్ వాఘ్‌కి ఫోన్ చేసి తాను ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా పాప కింద పడిపోయిందని చెప్పాడు. అంతేగాక టెంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని తెలిపాడు. దీంతో పూజా హడావిడిగా ఆస్పత్రికి చేరుకోగానే పాప అప్పటికే చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అయితే పోస్ట్‌మార్టంలో పాప మృతి అసహజమైనదని, ఊపిరాడక చనిపోయినట్లు ధృవీకరించారు. దీంతో భయందార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఖాన్‌ని అరెస్టు చేశారు.
(చదవండి: నకిలీ పురాతన వస్తువుల పేరుతో దాదాపు రూ.9 కోట్లు కొట్టేశారు!)
Comments
Please login to add a commentAdd a comment