
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు వంద పడకల ప్రభుత్వాస్పత్రిలో ఒక మహిళ 5.8 కేజీల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన నాగిరెడ్డి భార్య తేజస్వినిని మూడో కాన్పులో భాగంగా శనివారం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాన్పు కష్టమయ్యే అవకాశం ఉన్నందున వెంటనే గుంతకల్లు లేక ఆదోనికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.
ఈ మేరకు ఆమెను గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రసూతి వైద్యురాలు సుజాత ఆధ్వర్యంలో దాదాపు గంట పాటు శ్రమించి సాధారణ కాన్పు చేశారు. పుట్టిన మగబిడ్డ 5.8 కేజీల బరువున్నాడు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ సుజాత తెలిపారు. హైరిస్క్ అయినప్పటికీ ఎటువంటి సమస్య రాకుండా సాధారణ కాన్పు చేసినందుకు వైద్యురాలికి తేజస్విని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment