rat bite
-
శిశువును గాయపరిచిన ఎలుక.. చికిత్స పొందుతూ శిశువు మృతి!
నాగర్‌కర్నూల్ క్రైం: ఎలుక కరవడంతో గాయపడిన శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములకు చెందిన శివ కుటుంబం జిల్లాకేంద్రంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో నివాసం ఉంటోంది. శివ దంపతులకు 40 రోజుల క్రితం బాలుడు జన్మించడంతో భార్య, కుమారుడు నాగనూలులోని అత్తగారింటిలో ఉంటున్నారు. శనివారం సాయంత్రం బాలుడి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న శిశువు శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
Hyderabad: షాకింగ్.. మెక్ డొనాల్డ్స్‌లో చిన్నారిని కరిచిన ఎలుక
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెసార్టెంట్లో ఎలుక ఎనిమిదేళ్ల బాలుడిని కొరికి గాయపరిచింది. ఈ దారుణం కొంపల్లిలోని ఎస్పీజీ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లోఉన్న మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌లో మార్చి 8న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. రెస్టారెంట్‌లోని డైనింగ్ ఏరియా పక్కన ఉన్న వాష్‌రూమ్‌లో నుంచి ఒక పెద్ద ఎలుక ఒక్కసారిగా బయటకు పరుగెత్తుకొచ్చింది. అదే సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి కూర్చొని ఫుడ్ తింటున్నాడు. ఇంతలో ఎలుక బాలుడి పైకి ఎక్కి అతపి నిక్కర్లోకి చొరబడింది. భయంతో చిన్నారి కేకలు వేయగా.. అప్రమత్తమైన తండ్రి వెంటనే కొడుకు నిక్కర్లో నుంచి ఎలుకను బయటకు విసిరేశాడు. అయితే అప్పటికే ఎలుక బాలుడి తొడపై పంటితో గాయపరిచింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని బోయిన్‌పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడికి టెటానస్, యాంటీ రేబిస్ డోస్‌లు ఇచ్చామని.. అతని ఎడమకాలుపై రెండు చోట్ల కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి అయిన చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు.. రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై స్పందించిన కంపెనీ ఈ అంశంపై మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి స్పందిస్తూ.. భారత్‌లో ఉన్న అన్ని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో నాణ్యత, సేవ, శుభ్రత ( quality,service,clean) విషయంలో కంపెనీ రాజీపడదు, ఎలప్పుడూ హైస్టాండర్డ్లోనే నిర్వహిస్తుంటుంది. అయితే హైదరాబాద్‌లోని జరిగిన ఘటన గురించి తెలిసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాము. మరో సారి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మా సిబ్బంది ఎల్లప్పుడూ రెస్టారెంట్ల నాణ్యత, శుభ్రత విషయంలో అత్యధిక స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తారని ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆడిట్‌లోనూ బహిర్గతమైంది. మెక్‌డొనాల్డ్స్ కస్టమర్ల భద్రత, శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. తాము ఎలప్పుడూ సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. RODENT ATTACK ON A CHILD in the McDonald’s restaurent Ground Floor, SPG Hotel, Kompally, Hyderabad, Telangana 500096.@McDonalds @mcdonaldsindia @consumercourtin @PiyushGoyalOffc @director_food @AFCGHMC @fooddeptgoi @TOIIndiaNews @TOIHyderabad @ABPNews @ndtv @ChildWelfareGov pic.twitter.com/wrjeQgAiBh — Savio H (@SHenrixs) March 10, 2023 -
ఎలుక తెచ్చిన తంటా.. ఐదు లక్షల పరిహారం..
బెంగళూరు: అపార్ట్మెంట్లో ఎలుక పెద్ద రగడనే తెచ్చింది. ఒక కారులోని వైర్‌ను కొరికేయడంతో యజమాని తనకు ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షున్ని డిమాండ్ చేశాడు. ఇది గొడవగా మారి పోలీసుస్టేషన్లో కేస్ అయింది. వివరాలు.. బెంగళూరు గంగానగరలో కంఫర్ట్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ ఉంది. చెత్త పేరుకుపోయి ఎలుకల గోల అధికమైంది. ఎలుక ఒక కారు వైర్లను కొరికేసింది. దీంతో కారు యజమాని.. చెత్త తొలగించపోవడం వల్లనే ఎలుకల బెడద వచ్చిందని, ఈ నిర్లక్ష్యానికి అపార్ట్మెంట్ అసోసియేషన్ కారణమంటూ గలాటా చేశారు. గలాటతో ఆక్రోశానికి గురైన ఇతర ఫ్లాట్లవారు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిహారం ఇవ్వాలని తమను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు. చదవండి: (అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..) -
ఎలుక కొరికినా.. ఎందుకు పట్టించుకోలేదు?.. ఆ రోజు అసలు ఏం జరిగింది?
సాక్షి, వరంగల్/ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో ఎలుక ఘటన కేసులో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావును ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది. తాజాగా మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. వరంగల్ కలెక్టర్ గోపి అధ్యక్షతన ఎంజీఎం వైద్యులకు సంబంధం లేకుండానే అంతర్గత విచారణ వేగిరం చేసినట్టుగా తెలిసింది. ఎలుక కొరికినా.. ఎందుకు పట్టించుకోలేదు? భీమారానికి చెందిన శ్రీనివాస్ గత నెల 26న ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెస్పిరేటరీ ఇంటర్మీడియట్ కేర్ యూనిట్(ఆర్ఐసీయూ)లో చికిత్స అందించారు. అదేరోజు శ్రీనివాస్‌ను ఎలుక కొరికింది. వైద్యులు, సిబ్బంది ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. అక్కడి విభాగాధిపతి, రోగి బాగోగులు చూసుకునే స్టాఫ్‌నర్సులతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్‌ను బృందం విచారించినట్లు సమాచారం. మళ్లీ గురువారం అదే పేషెంట్‌ను ఎలుక కొరికే వరకు ఎందుకు పట్టించుకోలేదని, విధుల్లో అలసత్వంగా ఉన్నారని బృందం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఎంజీఎంను శుక్రవారం సందర్శించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఇప్పటికే అంతర్గత సమావేశంలో ఆర్ఐసీయూ ఇన్చార్జ్, నర్సింగ్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేయడం చర్యలు తీసుకునేందుకు సంకేతమనే ఎంజీఎం వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో ఉండే ఆర్‌ఐసీయూలోనే ఈ పరిస్థితి ఉంటే.. మిగతా వార్డుల్లో పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసే కాంట్రాక్టు సంస్థ ఏజిల్‌ను కూడా బ్లాక్ లిస్టులో పెడతామని ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించడంతో ఆ సంస్థపై చర్యలకు సంకేతాలిచ్చినట్లయ్యింది. ఇలా ఓ వైపు వైద్యులు, నర్సులు.. మరోవైపు కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటున్నారు. ఎలుకల కోసం వేట! ఎలుక కొరికిన ఘటనతో ఎంజీఎంకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో భారీ సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు. శనివారం ఉగాది అయినప్పటికీ చాలామంది పారిశుద్ధ్య కార్మికులు వార్డులను శుభ్రం చేయడం కనిపించింది. మురుగు కాల్వల్లో నీరు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకున్నారు. ఎలుకల కోసం మరిన్ని బోనులు ఏర్పాటు చేశారు. ఆయా బోనుల్లో చిక్కిన కొన్ని ఎలుకలను దూరంగా విడిచివచ్చినట్లు సిబ్బంది తెలిపారు. -
ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ కన్నుమూత
-
ఎంజీఎం ఘటన: ఎలుకల దాడిలో గాయపడ్డ బాధితుడి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందాడు. ఎలుకల దాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చికిత్స పొందుతూ.. ఇవాళ వేకువ జామున కన్నుమూశాడు. శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి. అతడి చేతి వేళ్లను కొరుక్కుతినడంతో రక్తస్రావం జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, చాలామంది ఎలుకల దాడికి గురయ్యారని పేషెంట్లు వాపోయారు. విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దు బాటు చర్యలకు దిగింది. శ్రీనివాస్‌పై ఎలుకల దాడిపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండె వైఫల్యంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దాంతో అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే నాలుగు రోజుల నుంచి చికిత్స పొందాడు. డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అతడి రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. శ్రీనివాస్ మృతదేహాన్ని నిమ్స్ నుంచి కుటుంబ సభ్యులు హన్మకొండకు తీసుకెళ్లారు. -
ఎంజీఎం దవాఖాన పరిస్థితిపై ఎలుక చెప్పిన కథ.. మీరే చదువుర్రి ఓసారి..
‘ఎలుక తోలుదెచ్చి ఏడాది ఉతికినా.. నలుపు నలుపేగాని తెలుపుగాదు’ అని మా మీద ఎందుకు ఏడ్వడం? మేమెలాగూ మారం! మరి మీరు?. ఈ రోజు ఒకరిని కొర్కినం.. రేపు మరొకర్ని’ అంటూ ఎంజీఎం వైద్యులు, దవాఖాన పరిస్థితిపై ఎలుక చెప్పిన కథ! – ఎంజీఎం/వరంగల్ డెస్క్ ‘‘గీ ఎంజీఎంను.. ధర్మాసుపత్రని చెప్తుండ్రు కదా.. మరి ఇక్కడ్కి రావాల్నంటే రోగులు ఎందుకు భయపడుతుండ్రు. మేం ఎలుకలు, మా పెద్దన్న(పందికొక్కు)లు ఉన్నయనా? దవాఖాన ఆర్ఐసీయూలో ఓ రోగిని కొరికినమనా? సరే.. మొదటిసారి కొరికినం. అది మా తప్పే? ఆ తర్వాత ఐదు దినాల్లో అదే రోగిని మూడుచోట్ల కొరికినం. అధికారులు, వైద్యులు మీరంతా ఏం జేసిండ్రు. కట్టు కట్టి వదిలేసిండ్రు. అది మీ తప్పు కాదా? అంతా మాపై నెట్టేసి.. చేతులు దులుపుకుంటుండ్రు! ఒక్కటి చెప్పుండ్రి మేమిక్కడ(ఎంజీఎంలో) టికానా ఏర్పాటు చేసుకునేతందుకు కారణం మీ నిర్లక్ష్యం కాదా?’’ అని ఎలుక తన మనోగతాన్ని బయటపెట్టింది. సంబంధిత వార్త: రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు మరో ఎలుక మీసాలు రువ్వుతూ గళమెత్తింది! ‘‘ఇట్లా ఒక్కటేమిటి మీ తప్పులు లెక్కలేనన్ని సూసినం. కొన్ని చెప్త ఇనుండ్రి. ఏ రోజైనా ఇక్కడి సిబ్బంది యాళ్లకు విధులకు హాజరైండ్లా? శానిటేషన్ ఎట్లుంది? వార్డుల నిర్వహణ ఎట్లున్నది? రోగులేమో వందల్లో, వేలల్లో ఉంటరు.. వైద్యులేమో అతి తక్కువ మంది ఉంటరు? యాళ్లపొద్దుగాళ్ల ఇంటికాన్నుంచి అచ్చే రోగులకు సక్కటి వైద్యమందిత్తలేరు! ఎలుకలమై ఉండి మాకే బాధనిపిస్తుంది’’ అంటూ మీసం తిప్పుతూ ఆర్ఐసీయూ వార్డుకు వెళ్లిపోయింది. చిట్టెలుక స్వరం మార్చి(బాధతో) ‘‘ఎంజీఎం ఆస్పత్రిలో ఆర్ఎంఓ–1 గా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజును గవుర్నమెంటు డిప్యూటేషన్‌పై వేరే జిల్లా డీఎంహెచ్‌ఓగా కొనసాగిస్తండ్లు. ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ముగ్గురు ఆర్‌ఎంఓలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ఒక్క అధికారి డిప్యుటేషన్లో ఉండగా, మరో ఒక్క ఆర్ఎంఓ స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ఒకే ఒక్క ఆర్ఎంఓ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. గీ ముచ్చట్లన్నీ దవాఖాన్ల సదువుకున్నోళ్లు చెప్తే విన్న’’ అంటూ చిట్టెలుక సరసరా ఆవరణలోని కలుగులోకెళ్లింది. ముక్కు మూసుకుంటూ మరో మూషికం.. ‘‘సుట్టపు సూపోలె ఎంజీఎంకు డాక్టర్లు వస్తరు. పోతరు! మేమే(ఎలుకలం) ఎప్పట్నుంచో ఈన్నే ఉంటన్నం. కొంతమంది డాక్టర్లు, సిబ్బంది సుట్టపు సూపోలే.. ఆస్పత్రికి వస్తున్నరు. రిజిస్టర్ల సంతకాలు పెట్టేతందుకే వస్తున్నరేమో అనే అనుమానం కల్గుతంది. వాళ్లతో పోలిస్తే మేమే నయం. మా పని మేం సక్కగ చేసుకుంటున్నం’’ అంటూ మూషికం దవాఖానలోని జంబుఖానను కొరుకుతూ చెబుతోంది! బరాబర్ అల్కిరి చేస్తం! ‘‘ఎంజీఎం మా అడ్డా. అవ్ బరాబర్ ఇక్కడ్నే ఉంటం. అల్కిరి జేస్తం. ఎవ్వర్నైనా కొరుకుతం. ఏ విభాగంలకైనా దూరుతం. అధికార్లు, వైద్యులు ఏం చేస్తరో చేసుకోండ్రి. మా జోలికొచ్చే ముందు శానిటేషన్ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యుండ్రి. ఆస్పత్రి ఆవరణల ఎక్కడపడితే అక్కడ చెత్త వేసుడు మానేయుండ్రి. ఆ తర్వాత మా జోలికి రండ్రి! అంటూ ఎలుకలన్నీ మూకుమ్మడిగా గొంతు కదిపాయి! -
రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు
ఎంజీఎం: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకెల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రిగా పేరుగాంచిన వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (ఎంజీఎం) ఐసీయూలోకి ఎలుకలు జొరబడ్డాయి. వెంటిలేటర్ల ద్వారా కృత్రిమశ్వాస అందించే వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేశాయి. కాళ్లు, చేతులు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. అధిక రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఆ రోగి పరిస్థితి విషమంగా ఉంది. ఏమీ కాదులే అంటూ... రోగి బంధువుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ (42) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గత నెల 26న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆర్ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. గత నెల 27న శ్రీనివాస్ కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరికినట్లు బంధువులు గమనించారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు కట్టుకట్టి ఏమీ కాదులే అని వదిలేశారు. అయితే గత నెల 30న అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌పై ఎలుకలు మరోసారి దాడి చేశాయి. ఆయన ఎడమ చేయి, కాలి వేళ్లతోపాటు మడమ వద్ద కొరకడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే అతని సోదరుడు శ్రీకాంత్ విషయాన్ని వైద్యులతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇదేమి ఆస్పత్రి.. వైద్యం అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన వైద్యులు రోగికి చికిత్స అందించారు. ప్రస్తుతం శ్రీనివాస్ ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్.. ఈ ఘటన వివరాలు తెలుసుకునేందుకు అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ గురువారం ఎంజీఎంకు చేరుకొని సూపరిండెంట్ శ్రీనివాస్, వైద్య బృందంతో కలసి ఆర్ఐసీయూ వార్డును సందర్శించారు. ఎలుకల సంచారం వెనక ఎవరి నిర్లక్ష్యం ఉందంటూ పరిపాలనాధికారులను ప్రశ్నించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఆర్ఐసీయూ వార్డుతోపాటు ఆస్పత్రిలో సాధారణ వార్డులన్నీ కలియతిరిగి వాటి స్థితిగతులపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. ప్రాణంపోతే ఎవరిది బాధ్యత? శ్రీనివాస్‌ను తొలిసారి ఎలుకలు గాయపరిచిన ఘటనను ఆస్పత్రి అధికారులతోపాటు వైద్యుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా పరిపాలనాధికారులు పట్టించుకోలేదు. వైద్యాధికారుల అలసత్వం వల్లే మరోసారి ఎలుకలు శ్రీనివాస్‌ను కొరికిపెట్టాయి. దీనివల్ల ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. ఇప్పుడు ఆయన ప్రాణం పోతే ఎవరు బాధ్యులవుతారో చెప్పాలి? – రోగి బంధుమిత్రులు సూపరింటెండెంట్, ఇద్దరు వైద్యులపై చర్యలు... సాక్షి, హైదరాబాద్: ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించారు. పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక పంపాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిపతులు ఆర్ఐసీయూ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఘటనకు కారణాలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు యాకుబ్, ఆబీబీలను సస్పెండ్ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం ఉపేక్షించబోదని హరీశ్‌రావు హెచ్చరించారు. -
దాచుకున్న డబ్బును కొరికేసిన ఎలుకలు : మహబూబాబాద్
-
వరంగల్ ఎంజీఎంలో దారుణం
ఎంజీఎం : వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమో రియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో మృతదేహాలకు భద్రత కరువైంది. మార్చురీ నిర్వహణపై అధి కారుల పట్టింపులేనితనం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఫ్రీజర్లలో భద్రపరిచిన మృతదేహాలను ఎలుకలు కొరికేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఓ వికలాంగుడి మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్న ఘటన సోమవారం వెలుగుచూసింది. ఆత్మహత్యకు పాల్పడిన ఒకరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీలో భద్రపరచగా తెల్లవారేసరికి ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఫ్రీజర్‌లోని మృతదేహాన్ని.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుబే దారి వికలాంగుల వసతిగృహంలో రామ్మోహన్ అనే వికలాంగుడు ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదనే మనస్తాపంతో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వసతి గృహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రామ్మోహన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని యాక్షన్ కమిటీ నేతలు భీష్మించుకు కూర్చు న్నారు. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదివారం రాత్రి ఎంజీఎం మార్చురీకి తరలించారు. సోమవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు.. ఫ్రీజర్‌లోని మృతదేహం చేతి భాగాన్ని ఎలుకలు కొరకడాన్ని గమనించి నివ్వెరపోయారు. ఎనిమిది ఫ్రీజర్లకు రెండే కొన్ని నెలల క్రితం ఎంజీఎం మార్చురీలో ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరకడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మార్చురీ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా పరిస్థితి ఏమాత్రం మారలేదు. మార్చురీలో 8 ఫ్రీజర్లు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండే అందుబాటులో ఉన్నాయి. దీంతో మార్చురీకి రెండు కన్నా ఎక్కువ మృతదేహాలొస్తే వాటికి రక్షణ లేకుండాపోతోంది. మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై కుటుంబ సభ్యులు, బం«ధుమిత్రులు సిబ్బందిని ప్రశ్నించగా.. తరుచూ జరిగే ఘటనలేనని పేర్కొనడం గమనార్హం. పాత భవనం.. సిబ్బంది కొరత.. ఎంజీఎం మార్చరీ ప్రాంగణమంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఎలుకలకు స్థావరంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. ఫోరెన్సిక్ వైద్యులు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇద్దరే విధుల్లో ఉన్నారు. ఆరుగురు నాలుగో తరగతి సిబ్బందికిగాను ముగ్గురే ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. మార్చురీ భవనం పాతబడటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని ఫోరెన్సిక్ వైద్యులు చెబుతున్నారు. -
ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువు
నిండా రెండు నెలలు కూడా వయసులేని ఓ మగశిశువు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంటే.. ఓ ఎలుక అతడి ముక్కును కొరికేసింది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీంతో ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేయగా, మరో కేర్‌టేకర్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు. రెండు మూడు రోజుల క్రితమే ఆ పిల్లాడి ముక్కును ఎలుక కొరికేసినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటిన్నర నెలల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పుట్టిన ఆ పిల్లాడి ఆరోగ్యం బాగా క్షీణించడంతో అతడిని ధార్ జిల్లా ఆస్పత్రిలో చేర్చేసి తల్లిదండ్రులు వెళ్లిపోయారని సివిల్ సర్జన్ డాక్టర్ సీఎస్ గంగ్రాడే చెప్పారు. తర్వాత ఆ పిల్లాడికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా అతడి ముక్కును ఎలుక కొరికేసింది. పైపెచ్చు ఆ శిశువు పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి స్టాఫ్ నర్సు సోనాలీ భిడేను సస్పెండ్ చేశామని, ఆశా రాథోడ్ అనే కేర్‌టేకర్‌ను ఉద్యోగం నుంచి తీసేశామని డాక్టర్ గంగ్రాడే తెలిపారు. -
ఎలుకలు కొరికాయి కానీ..
శిశువు మృతికి అవే కారణం కాదు * ప్రభుత్వానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక * నివేదికలో విభిన్న అంశాలు * పుట్టుకతోనే శిశువుకు అసాధారణ లోపం ఉంది * రెండు సార్లు మాత్రం ఎలుకలు కొరికాయి సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువుపై దాడి అభియోగం నుంచి ‘ఎలుకలను’ తప్పించే ప్రయత్నం జరిగింది. ఆస్పత్రిలో ఎలుకల సంచారం తీవ్రంగా ఉన్నప్పటికీ అవి కొరికిన కారణంగానే హృదయవిదారకరీతిలో శిశువు మృతిచెందలేదని చెప్పడానికి అధికారులు, ప్రభుత్వ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. ఆస్పత్రిలో చేరినప్పుడే శిశువు అనేక సమస్యలతో బాధపడుతున్నాడని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. మరణానికి ఎలుక లు కొరకడమే కారణం కాకపోవచ్చంటూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఆ శిశువు ఈనెల 17వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడని, కన్జెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో ఉన్న ఆ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించారని నివేదికలో పేర్కొన్నారు. 20వ తేదీన శస్త్రచికిత్సకు సిద్ధం చేశారని, ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఈనెల 23న శిశువు ఎడమచేతికి ఎలుకలు గాయం చేశాయని, ఈ విషయాన్ని ఇన్చార్జి ప్రొఫెసర్ డా.భాస్కరరావుకు సమాచారమిచ్చినట్టు కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా ఈనెల 26 తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతీపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఈ రకంగా ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకలే కారణం కాకపోయి ఉండొచ్చని నివేదించారు. బుధవారం సాయంత్రం అంటే 26 వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెందిన తర్వాత మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఎలుకల కథ కంచికి చేరేలా ఈ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో ఘటన తీవ్రతను, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలంటూ నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్ఎంవో తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరినీ ఎలుకలు కొరకలేదని, అందువల్ల ఈ శిశువు కూడా ఎలుక కొరికిన కారణంగా మృతి చెంది ఉండకపోవచ్చని నివేదికలో పొందుపరిచారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే తమ బిడ్డ మృతికి కారణమని గొడవ చేశారని కూడా అందులో ప్రస్తావించారు. సూపరింటెండెంట్ అందించిన నివేదిక మేరకు పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది ⇒ డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్చార్జి హెచ్ఓడీ ⇒ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ⇒ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్నర్స్ ⇒ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్ ⇒ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్ ⇒ జి.జయజ్యోతి కుమారి, స్టాఫ్‌నర్స్ -
శిశువు మృతికి ఎలుకలే కారణం కాదు!
పుట్టుకతోనే అసాధారణ లోపం ఉంది ఎలుకల వల్లే మృతిచెందారని అనుకోవడం లేదు 23వ తేదీన ఎడమ చేతికి ఎలుకలు కొరికిన గాట్లు గుర్తింపు 26వ తేదీన తిరిగి ఎలుకలు ఛాతీపై దాడిచేసినట్టు వెల్లడి ప్రభుత్వానికి గుంటూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ నివేదిక సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి మృతి చెందిన శిశువు కేసు నుంచి బయటపడేందుకు ఇటు వైద్యసిబ్బంది, అటు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వేణుగోపాల్‌రావు ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ఈనెల 17వ తేదీన విజయవాడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కన్జెనిటల్ అనామిలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో చేరిన ఈ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించామని, 20వ తేదీన శస్త్ర చికిత్సకు సిద్ధం చేశామని, వెంటిలేటర్‌పై ఉన్న ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని పేర్కొన్నారు. ఈనెల 23న శిశువు ఎడమ చేతికి ఎలుకల గాటు పడి ఉందని, ఈ విషయాన్ని ఇన్చార్జీ, ప్రొఫెసర్ డా.భాస్కర్‌రావుకు సమాచారమిచ్చామని కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా దురదృష్టవశాత్తు ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతిపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకల గాట్లే కాకపోయి ఉండచ్చునని తెలిపారు. బుధవారం సాయంత్రం అంటే 26వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెంది తీవ్రంగా వివాదంగా మారడం, అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ఎలుకల కథ కంచికి చేరేలా నివేదిక మార్చినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో నివేదికను బలహీనపరిచేలా చేసేటట్టు నాయకులే ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే తెలివిగా ఆర్ఎంఓ తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఈ శిశువు కూడా ఎలుక కారణంగా మృతి చెంది ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే మృతికి కారణమని గొడవ చేశారని వెల్లడించారు. బాక్స్ పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది వీరే.. డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్చార్జీ హెచ్ఓడీ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్నర్స్ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్ జి.జయజ్యోతి కుమారి. -
ఒక్క ఎలుక.. రైలును ఆపేసింది!!
తమిళనాడులోని మదురై జంక్షన్లో ఓ రైలు దాదాపు అరగంట పాటు ఆగిపోయింది. ఇంతకీ ఆ రైలును అంతసేపు ఆపేసిన వీవీఐపీ ఎవరో తెలుసా.. ఓ ఎలుక!! ఎలాగంటారా, రైల్లో ప్రయాణిస్తున్న ఓ పెద్దాయనను ఆ ఎలుక కాస్తా కొరికిపెట్టింది. ఛార్లెస్ (54) అనే పెద్దమనిషి చెన్నై నుంచి తిరునల్వేలి వెళ్లే నెల్లై ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజామున ఆ రైలు మదురై స్టేషన్ చేరుకుంటోందనగా.. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఓ ఎలుక ఆయన చెవిని కొరికి పారేసింది. 5 గంటల సమయంలో మదురైకి రైలు చేరుకోగానే ముందుగానే అక్కడకు వచ్చిన వైద్యులు వెంటనే ఆయనకు చికిత్స చేశారు. ఆ చికిత్స కోసం రైలును దాదాపు అరగంట పాటు ఆపేశారు. తిరునల్వేలి, కన్యాకుమారి మీదుగా వెళ్లే చాలావరకు రైళ్లలో ఎలుకల బాధ భరించలేకుండా ఉన్నామని చాలాసార్లు ఫిర్యాదుచేసినా, సమస్య తీరలేదని రైల్వే యూజర్స్ అసోసియేషన్ నాయకుడు కేశవన్ తెలిపారు. ప్రధానంగా ప్రయాణికులు కూడా ఏవో ఒక తినుంబండారాలు తిని.. రైల్లో సగం సగం వదిలేయడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన అన్నారు.