సౌదీలో దారుణం.. సజీవంగా 5 భారతీయుల ఖననం | Five Indians allegedly buried alive in Saudi Arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో దారుణం.. సజీవంగా 5 భారతీయుల ఖననం

Published Fri, Feb 28 2014 7:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

Five Indians allegedly buried alive in Saudi Arabia

రియాద్: బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియాకు వెళ్లిన ఐదుగురు భారతీయుల  జీవితాలు విషాదకర రీతిలో ముగిశాయి. వీరిలో ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడనే కారణంతో ఐదుగురినీ ఘోరాతిఘోరంగా చంపారు. చిత్రహింసలకు గురిచేసి బతికుండగానే ఖననం చేశారు. ఒళ్లు జలదరించే ఈ సంఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుల్లో ఓ వ్యక్తి కోర్టులో ఇచ్చిన వాంగూల్మం మేరకు వివరాలిలా ఉన్నాయి.

సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్ ఖతిఫ్లో అలీ హబీబ్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ఓ మహిళ నుంచి వ్యవసాయ భూమిని గుత్తకు తీసుకున్నాడు. ఇటీవలను పొలాన్ని చదును చేస్తుండగా ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ కేసులో పోలీసులు 25 మందిని అరెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. 2010లో ఈ నేరం చేసినట్టు ముగ్గురు నిందితులు కోర్టులో అంగీకరించారు. స్నేహితుడి సమాచారం మేరకు ఓ రోజు రాత్రి ఫామ్కు వెళ్లానని ఓ వ్యక్తి చెప్పాడు. అక్కడ ఐదుగురు వ్యక్తుల్ని చేతులు కట్టేసి బంధించారని కోర్టుకు వివరించాడు. వారిలో ఒక వ్యక్తి యజమాని కుమార్తె, ఇతర మహిళను లైంగికంగా వేధించాడని తన స్నేహితుడు చెప్పినట్టు తెలిపాడు. తాము మద్యం సేవించి భారతీయులను ఓ గదిలో బంధించి విచక్షణా రహితంగా కొట్టినట్టు చెప్పాడు. అనంతరం వారు కదలకుండా తాళ్లతో కట్టేశామని నిందితుడు కోర్టుకు వివరించాడు. వారిని ట్రక్లో తరలించి ఫామ్లో 2.5 మీటర్ల లోతున గోతిని తవ్వి బతికుండగానే ఖననం చేసినట్టు చెప్పాడు. వారితో గుర్తింపు కార్డులను పూడ్చివేసినట్టు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement