Five Indians
-
అమెరికాలో ఐదుగురు భారతీయుల అరెస్ట్
న్యూయార్క్: అమెరికాలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన ఐదుగురు భారతీయులను న్యూయార్క్ అధికారులు నిర్బంధించారు. 15న ఓ అమెరికన్ తన వాహనంలో ఐదుగురు భారతీయులను తీసుకువస్తూ మోరిస్టౌన్ చెక్‌పాయింట్‌ను దాటేందుకు యత్నించాడు. అధికారులు అనుమానించడంతో ఆ వాహనాన్ని సమీపంలోని దుకాణం వద్ద ఆపాడు. దీంతో అందులో ఉన్న భారతీయులు దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. అధికారులు లోపలికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవని తేలింది. దీంతో ఆ ఐదుగురినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో భారతీయుల సంఖ్య 9 వేలకు పైమాటే. లండన్‌లో ఐదుగురు భారతీయులు లండన్: డ్రగ్స్, మనీ లాండరింగ్ దందా నడుపుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును బ్రిటన్ దర్యాప్తు విభాగం రట్టు చేసింది. ఇందుకు సంబంధించి అరెస్టయిన 10 మందిలో ఐదుగురు భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరంతా కలిసి మూడేళ్లలో 15.5 మిలియన్ పౌండ్లను (రూ.143 కోట్లు) దుబాయికి దొంగతనంగా సూట్‌కేసుల్లో తరలించి, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. -
మృతుల్లో ఐదుగురు భారతీయులు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో శుక్రవారం రెండు మసీదుల వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులున్నారని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ ఆదివారం ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి జాత్యహంకారంతో అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరపగా, 50 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లో 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని శుక్రవారమే హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. ఐదుగురు భారతీయులు ఈ కాల్పుల్లో చనిపోయారని తాజాగా ధ్రువీకరించింది. మరణించిన భారతీయులను మహబూబ్ ఖోఖర్, రమీజ్ వోరా, అసీఫ్ వోరా, అన్సీ అలిబవ, ఓజైర్ ఖదీర్‌గా గుర్తించామంది. వీరిలో ఓజైర్ ఖదీర్ హైదరాబాద్ వాసి. కాగా, మరో ఇద్దరు హైదరాబాదీలు హసన్ ఫరాజ్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్లు కూడా మృతి చెందినట్లు శనివారం సమాచారం వచ్చినా, ఆదివారం హై కమిషన్ విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం. క్రైస్ట్ చర్చ్ బాధితుల కుటుంబ సభ్యులకు వీసాలను త్వరగా మంజూరు చేసేందుకు న్యూజిలాండ్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిందని హై కమిషన్ కోరింది. కాగా, తమ కుటుంబ సభ్యుడు టారంట్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తమకు విభ్రాంతి కలిగించిందనీ, తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం టారంట్ సోదరి, తల్లిపై ఎవరూ దాడి చేయకుండా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారని టారంట్ నానమ్మ చెప్పారు. కాగా, టారంట్ కాల్పుల ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని అడ్డుకోలేకపోవడంపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాధానాల కోసం వేచి చూస్తున్నానని ప్రధాని జసిండా తెలిపారు. బుల్లెట్లు లేని తుపాకీతో తరిమాడు కాల్పుల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి గుండ్లు లేని తుపాకీతో హంతకుడిని తరిమిన ఓ వ్యక్తిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చి న్యూజిలాండ్‌లో శరణార్థిగా ఉంటున్న అబ్దుల్ అజీజ్.. లిన్‌వుడ్ మసీదులో హంతకుడు టారంట్ మరింత మందిని కాల్చకుండా నిలువరించి ఈ ఘటనలో హీరోగా నిలిచాడు. కాల్పుల శబ్దం వినపడగానే అజీజ్ తొలుత కేవలం క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్‌ను తీసుకెళ్లి టారంట్ పైకి విసిరి అతని దృష్టిని మళ్లించాడు. అనంతరం టారంట్ కాల్పులు జరిపి, బుల్లెట్లు అయిపోవడంతో పడేసిన తుపాకీ ఒకటి అతనికి దొరికింది. ఆ తుపాకీతో అజీజ్ బెదిరించడంతో టారంట్ తన తుపాకీని కింద పడేశాడు. టారంట్‌ను అజీజ్ వెంటాడుతూ వెళ్లి, కారులో పారిపోతుండగా, కారు వెనుక అద్దాన్ని పగులగొట్టాడు. అజీజ్ ఈ సాహసం చేయకపోయుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. -
ఫైనల్ కు ఐదుగురు భారత మహిళా బాక్సర్లు
తైపీ: భారత మహిళా బాక్సర్లు మరోసారి మెరిశారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) టోర్నీలో భాగంగా ఇక్కడ శుక్రవారం జరిగిన మహిళల జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత మహిళలు తమ సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో జరిగిన పోరులో ఐదుగురు భారత బాక్సింగ్ క్రీడాకారుణులు విజయం సాధించి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించారు. 48 కేజీల విభాగంలో సోనియా, 50 కేజీల విభాగంలో సావితా, మన్ దీప్ సంధూ 52 కేజీల విభాగంలో, సాక్షి 54 కేజీల విభాగంలో, నిహారిక గోనెల్లా 70 కేజీల విభాగంలో రాణించి తుది పోరుకు సన్నద్ధమయ్యారు. థాయ్ లాండ్ కు చెందిన చిరాంచయాపై 2-1 తేడాతో సోనియా గెలుపొందగా, టర్కీ క్రీడాకారిణి అయేటన్ ను 3-0 తేడాతో సావితా కంగుతినిపించింది. అనంతరం మన్ దీప్ సంధూ 2-1 తేడాతో ఫ్రెంచ్ మహిళ జోహన్నాను ఓడించగా, చైనా క్రీడాకారిణి యూ యాన్ పై నిహారిక విజయం సాధించి ఫైనల్ కు చేరింది. -
వీసాల మోసం కేసు.. ఐదుగురు భారతీయుల అరెస్టు
న్యూయార్క్: అమెరికాలో భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలు, ఆర్థిక సాయం విషయంలో మోసానికి పాల్పడిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సురేశ్ హీరానందనే(60), ఆయన కుమారుడు సమీర్ హీరానందనే(27), సోదరి అనితా చాబ్రియా(49), బావమరిది లలిత్చాబ్రియా(54), ఉద్యోగి సీమా షా(41) ఉన్నారు. వీరిని గురువారం మన్హటన్ ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. అభియోగాలు రుజువైతే 5-20 ఏళ్ల శిక్ష పడొచ్చు. -
ఆ విమానం సముద్రంలో కూలింది
-
ఆ విమానం సముద్రంలో కూలింది
దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయిందన్న మలేసియా ప్రధాని నజీబ్ శాటిలైట్ సమాచారంతో నిర్ధారణకు వచ్చాం కౌలాలంపూర్: అనుమానం నిజమైంది.. మిణుకుమిణుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయింది! 17 రోజుల కిందట గల్లంతైన మలేసియా విమానం కథ నడిసముద్రంలో ముగిసింది. ఐదుగురు భారతీయులు సహా 239 మంది ఉన్న ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో మారుమూల కూలిపోయిందని, అందులోని వారెవరూ బతికి బయటపడలేదని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ విషణ్ణ వదనంతో ప్రకటించారు. ఆయన సోమవారం కౌలాలంపూర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విషాదానికి చిహ్నంగా ఆయన నల్లదుస్తులతో సమావేశానికి వచ్చారు. పెర్త్‌కు పశ్చిమంగా.. : ‘ఫ్లైట్ ఎంహెచ్370 విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని తీవ్ర విచారం, బాధ తో చెబుతున్నా. బ్రిటన్‌కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) తాజా విశ్లేషణ, బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ ఇన్మార్సాత్ అందించిన ఉపగ్రహ సమాచారం ప్రకారం విమానం దక్షిణ కారిడార్ మీదుగా ఎగిరి, ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు పశ్చిమంగా దక్షిణ హిందూమహాసముద్రం నట్టనడుమ చివరిసారిగా కనిపించినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇది ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాలకు నిజంగా గుండెలు పగిలే వార్తే’ అని రజాక్ చెప్పారు. విమానం కూలిన ప్రాంతం ల్యాండింగ్ స్థలాలకు చాలా దూరంగా మూరుమూల ఉందన్నారు. బాధ్యత ప్రకారం ఈ సమాచారాన్ని మలేసియా ఎయిర్‌లైన్స్ అధికారులు.. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలకు తెలిపారన్నారు. మంగళవారమూ విలేకర్ల సమాచారాన్ని నిర్వహిస్తాన న్న ఆయన.. ఈ ఉదంతంపై మరింత సమాచారాన్ని వెల్లడించనున్నట్లు సంకేతమిచ్చారు. దక్షిణ హిందూమహాసముద్రంలో ఐదురోజులుగా సాగుతున్న గాలింపులో.. గల్లంతైన విమానానివిగా భావిస్తున్న శకలాలను గుర్తించిన నేపథ్యంలో నజీబ్ ఈ వివరాలు తెలిపారు. గల్లంతైన విమానంలోని వారి కుటుంబాలకు మలేసియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. విమానం సముద్రంలో కూలిందన్న వార్త తెలిసి బీజింగ్‌లోని ఓ హోటల్లో ఉన్న ప్రయాణికుల బంధుమిత్రులు ఒకరినొకరు పట్టుకుని గుండెలవిసేలా రోదించారు. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తూ.. బయల్దేరిన గంటసేపటికే అదృశ్యమవడం తెలిసిందే. ఇది సముద్రంలో కూలినట్లు భావిస్తున్నా కచ్చితంగా ఎక్కడ, ఎందువల్ల కూలిందో స్పష్టత రావడం లేదు. దీని కోపైలట్ ఫరీక్ తొలిసారిగా చెక్-కోపైలట్ లేకుండానే విమానం ఎక్కినట్లు సమాచారం. శకలాల కోసం గాలింపు..: పెర్త్ నగరానికి 2,300 కి.మీ దూరంలో సముద్రంలో తేలియాడుతున్న విమాన శకలాలుగా భావిస్తున్న రెండు వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి ఆస్ట్రేలియా నౌక సోమవారం ప్రయత్నించింది. వీటిలో ఒకటి బూడిద లేదా ఆకుపచ్చ రంగులో గుండ్రం గా, మరొకటి నారింజ రంగులో ఉందని, అయితే ఇవి మలేసియా విమానానివో కావో చెప్పలేమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ చెప్పారు. అదే ప్రాంతంలో తెల్లగా చతురస్రాకారంలో ఉన్న వస్తువులు తమ విమానానికి కనిపించాయని చైనా తెలిపింది. ఎంహెచ్370లో చెక్కబల్లలు ఉన్నాయని, అయితే సముద్రంలో కనిపించిన చెక్కబల్ల ఆ విమానంలోనిదే అని చెప్పలేమని మలేసియా మంత్రి హుసేన్ అన్నారు. విమాన బ్లాక్‌బాక్సులు సముద్రంలో 20 వేల అడుగుల కింద ఉన్నా పసిగట్టే ‘టోవ్డ్ పింగర్ లొకేటర్ 25’ పరికరాన్ని పంపుతున్నట్లు అమెరికా తెలిపింది. -
మలేసియా విమానం శిథిలాల ఆచూకీ?
ఆచూకీ తెలియకుండా పోయిన మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం శిథిలాలు దక్షిణ చైనా సముద్రంలో దొరికాయంటూ.. వాటికి సంబంధించిన మూడు శాటిలైట్ చిత్రాలను చైనా విడుదల చేసింది. వీటిని స్టేట్ అడమ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీ ఫర్ నేషనల్ డిఫెన్స్ సంస్థ విడుదల చేసింది. మూడు భారీ వస్తువులు సముద్రంలో తేలుతున్నట్లుగా ఆ చిత్రాల్లో ఉంది. వాటిలో ఒకటి 24 మీటర్ల వెడల్పు, 22 మీటర్ల పొడవు ఉండగా, మరొకటి 13 మీటర్ల వెడల్పు, 18 మీటర్ల పొడవు, ఇంకొకటి 14 మీటర్ల వెడల్పు, 19 మీటర్ల పొడవు చొప్పున ఉన్నాయి. మలేసియా, వియత్నాం మద్యలో ఈ వస్తువులున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని శిథిలాలు కనిపించినట్లు చెప్పినా, అవేవీ కూడా అదృశ్యమైన ఎంహెచ్-370 విమానానికి సంబంధించినవి కావని తేలింది. తర్వాత చైనాకు చెందిన పది ఉపగ్రహాలు ఈ విమానం ఆచూకీ కోసం గాలించాయి. మొత్తం 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానం ఆచూకీ కోసం ఆరు రోజులుగా ప్రయత్నిస్తున్నా, చైనా అందించిన సమాచారం తప్ప ఎలాంటి వివరాలు ఇంతవరకు తెలియలేదు. ఈ విమానంలో ఐదుగురు భారతీయులతో పాటు 154 మంది చైనీయులు కూడా ఉన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన 42 నౌకలు, 39 విమానాలు ఈ విమానం కోసం గాలిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా ఈ విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. -
సముద్రంలో కూలిన విమానం!
239 మంది మృతి! ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతున్న విమానం అదృశ్యం బీజింగ్/కౌలాలంపూర్: మరో ఘోర విమాన ప్రమాదం... 239 మంది ప్రాణాలు సముద్రగర్భంలో కలసిపోయాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళుతున్న బోయింగ్ విమానం మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఇందులో ఐదుగురు భారతీయులు, ఇద్దరు శిశువులు సహా 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇది సముద్రంలో కూలిపోయి ఉంటుందని, 239 మందీ మరణించి ఉంటారని భావిస్తున్నారు. వియత్నాం తీర ప్రాంతంలోని సముద్రంలో భారీగా చమురు తెట్టు కనిపించడాన్ని బట్టి అక్కడే విమానం కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. - విమానం శుక్రవారం కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన తర్వాత రాత్రి 11:10 గంటల సమయంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. అది ఉదయం 6.30 గంటలకు బీజింగ్ చేరాల్సి ఉంది. - మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ బోయింగ్ ఎంహెచ్370 విమానంలో 14 దేశాలకు చెందినవారున్నారు. వీరిలో అత్యధికంగా 154 మంది చైనా దేశీయులు కాగా 38 మంది మలేసియా వాసులు, ఏడుగురు ఇండోనేసియా వారు, ఆరుగురు ఆస్ట్రేలియన్లు, నలుగురు అమెరికన్లు, ఇద్దరు ఫ్రాన్స్ దేశస్థులు, ఇద్దరు న్యూజిలాండ్ వాసులు, ఇద్దరు ఉక్రేనియన్లు, ఇద్దరు కెనడా వాసులు, రష్యా, డచ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. - దక్షిణ చైనా సముద్రంలోని కోటా బారూ ప్రాంతానికి 120 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు చివరి సారిగా ఆ విమానం నుంచి కేంద్రానికి సిగ్నళ్లు అందాయి. - వియత్నాం దక్షిణ తీర ప్రాంతం దగ్గరలోని సముద్రంలో రెండు చోట్ల భారీ స్థాయిలో చమురు తెట్టు కనిపించినట్లు వియత్నాం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయని, అయితే విమాన శకలాలేవీ కనిపించలేదని తెలిపింది. - చివరిసారి విమానం సిగ్నళ్లు అందిన ప్రాంతం నుంచి చుట్టుపక్కలంతా గాలించాల్సిందిగా ఆదేశించినట్లు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ చెప్పారు. 15 సాయుధ దళాలు, వైమానిక, నౌకా దళాలతోపాటు మలేసియా తీర రక్షణ ఏజెన్సీలు నౌకలు తీవ్రంగా గాలిస్తున్నాయని వెల్లడించారు. వియత్నాం, చైనా, సింగపూర్, అమెరికాలు తమకు ఈ గాలింపులో సహకరిస్తున్నాయన్నారు. - మృతుల్లో ఇటలీకి చెందిన ఒకరు, ఆస్ట్రియాకు చెందిన మరొకరు ఉన్నట్లు మొదట్లో వార్తలు రాగా.. ఆ ప్రయాణికులిద్దరూ క్షేమంగా ఉన్నారని తర్వాత తేలింది. వేర్వేరు సంఘటనల్లో తమ పాస్‌పోర్టులు పోగొట్టుకున్నామని, అందువల్లే తాము ఆ విమానంలో ప్రయాణించలేదని వారు మీడియాకు తెలిపారు. ఆ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే తమ పేర్ల మీద వేరెవరో విమానం ఎక్కి ఉంటారని, వారు ఉగ్రవాదులు కూడా అయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు బీజింగ్/కౌలాలంపూర్: కూలిపోయినట్లు భావిస్తున్న మలేసియా విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రయాణికులు ఐదుగురిని చేత్న కోలేకర్(55), స్వనంద్ కోలేకర్(23), వినోద్ కోలేకర్(59), చంద్రికా శర్మ(51), క్రాంతి శీర్షాత్(44)గా గుర్తించినట్లు బీజింగ్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం తెలిపింది. వీరిలో చంద్రిక.. చెన్నైలోని ఒక ఎన్జీవో సభ్యురాలు. మంగోలియాలో జరిగే ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) సదస్సులో పాల్గొనడానికి వెళుతూ ఆ విమానం ఎక్కారు. విమానంలో భారతీయ సంతతికి చెందిన కెనడావాసి ముక్తేష్ ముఖర్జీ(42) కూడా ఉన్నారు. -
సౌదీలో దారుణం.. సజీవంగా 5 భారతీయుల ఖననం
రియాద్: బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియాకు వెళ్లిన ఐదుగురు భారతీయుల జీవితాలు విషాదకర రీతిలో ముగిశాయి. వీరిలో ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడనే కారణంతో ఐదుగురినీ ఘోరాతిఘోరంగా చంపారు. చిత్రహింసలకు గురిచేసి బతికుండగానే ఖననం చేశారు. ఒళ్లు జలదరించే ఈ సంఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుల్లో ఓ వ్యక్తి కోర్టులో ఇచ్చిన వాంగూల్మం మేరకు వివరాలిలా ఉన్నాయి. సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్ ఖతిఫ్లో అలీ హబీబ్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ఓ మహిళ నుంచి వ్యవసాయ భూమిని గుత్తకు తీసుకున్నాడు. ఇటీవలను పొలాన్ని చదును చేస్తుండగా ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ కేసులో పోలీసులు 25 మందిని అరెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. 2010లో ఈ నేరం చేసినట్టు ముగ్గురు నిందితులు కోర్టులో అంగీకరించారు. స్నేహితుడి సమాచారం మేరకు ఓ రోజు రాత్రి ఫామ్‌కు వెళ్లానని ఓ వ్యక్తి చెప్పాడు. అక్కడ ఐదుగురు వ్యక్తుల్ని చేతులు కట్టేసి బంధించారని కోర్టుకు వివరించాడు. వారిలో ఒక వ్యక్తి యజమాని కుమార్తె, ఇతర మహిళను లైంగికంగా వేధించాడని తన స్నేహితుడు చెప్పినట్టు తెలిపాడు. తాము మద్యం సేవించి భారతీయులను ఓ గదిలో బంధించి విచక్షణా రహితంగా కొట్టినట్టు చెప్పాడు. అనంతరం వారు కదలకుండా తాళ్లతో కట్టేశామని నిందితుడు కోర్టుకు వివరించాడు. వారిని ట్రక్‌లో తరలించి ఫామ్‌లో 2.5 మీటర్ల లోతున గోతిని తవ్వి బతికుండగానే ఖననం చేసినట్టు చెప్పాడు. వారితో గుర్తింపు కార్డులను పూడ్చివేసినట్టు తెలిపాడు.