ఫైనల్ కు ఐదుగురు భారత మహిళా బాక్సర్లు | Five Indians in World Jr Women's Boxing | Sakshi
Sakshi News home page

ఫైనల్ కు ఐదుగురు భారత మహిళా బాక్సర్లు

Published Fri, May 22 2015 7:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

Five Indians in World Jr Women's Boxing

తైపీ: భారత మహిళా బాక్సర్లు మరోసారి మెరిశారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) టోర్నీలో భాగంగా ఇక్కడ శుక్రవారం జరిగిన మహిళల జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత మహిళలు తమ సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో జరిగిన పోరులో  ఐదుగురు భారత బాక్సింగ్ క్రీడాకారుణులు విజయం సాధించి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించారు.

 

48 కేజీల విభాగంలో సోనియా, 50 కేజీల విభాగంలో సావితా, మన్ దీప్ సంధూ 52 కేజీల విభాగంలో, సాక్షి 54 కేజీల విభాగంలో, నిహారిక గోనెల్లా 70 కేజీల విభాగంలో రాణించి తుది పోరుకు సన్నద్ధమయ్యారు.  థాయ్ లాండ్ కు చెందిన చిరాంచయాపై 2-1 తేడాతో సోనియా గెలుపొందగా, టర్కీ క్రీడాకారిణి అయేటన్ ను 3-0 తేడాతో సావితా కంగుతినిపించింది. అనంతరం మన్ దీప్ సంధూ 2-1 తేడాతో ఫ్రెంచ్ మహిళ జోహన్నాను ఓడించగా, చైనా క్రీడాకారిణి యూ యాన్ పై నిహారిక విజయం సాధించి ఫైనల్ కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement