చంఢీగఢ్: ఓ యువతిని అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో పోలీసులు 8 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. వివరాలు.. రోహ్తక్ జిల్లాలోని ఓ గ్రామంలో నేపాలీ మహిళ (28)ను ఈనెల ఒకటో తేదీ సాయంత్రం మద్యం మత్తులో అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులుగా ఉన్నారు. ఆ యువతి అపస్మారన స్థితిలోకి వెళ్లినా కూడా మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాదాపు మూడు గంటల సేపు ఆ యువతిని రేప్ చేసి అనంతరం హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజేష్ అలియస్ గుచ్చడు, సునీల్ అలియస్ షీలా, సర్వార్ అలియస్ బిల్లు, మన్బీర్, సునీల్ అలియస్ మధ, పవన్, పర్మోద్ అలియస్ పాదాం, సతోష్ లను విచారించి అరెస్టు చేశామని ప్రత్యేక విచారణ బృందం చీఫ్ అమిత్ భాటియా చెప్పారు.
తొమ్మిదో నిందితుడుగా ఉన్న సోంబీర్ హత్య చేసిన తరువాత ఢిల్లీకి పరారయ్యాడు. తోటి నిందితులను అరెస్టు చేశారని తెలుసుకున్న కొద్ది గంటల్లోనే తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
అత్యాచారం కేసులో 8 మంది అరెస్టు
Published Sat, Feb 14 2015 9:25 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM
Advertisement
Advertisement