9వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి..! | Class 9 Girl Allegedly Kidnapped, Raped In Car In Rohtak | Sakshi
Sakshi News home page

9వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి..!

Published Sat, Jan 9 2016 5:17 PM | Last Updated on Sat, Sep 15 2018 7:15 PM

9వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి..! - Sakshi

9వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి..!

రోహ్‌తక్‌: కోచింగ్‌ క్లాస్‌ నుంచి తిరిగి వస్తున్న 9వ తరగతి బాలికపై హరియాణాలోని రోహ్‌తక్‌లో దారుణం చోటుచేసుకుంది. బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు ఆమెపై నడుస్తున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

గురవారం సాయంత్రం కోచింగ్ క్లాస్‌ నుంచి తిరిగొస్తుండగా బాలికను ఇద్దరు వ్యక్తులు కారులో అపహరించుకుపోయారు. ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి.. దాదాపు ఆరు గంటలపాటు తమ నిర్బంధంలో ఉంచుకున్నారు. జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించి బాలికను విడిచిపెట్టారు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement