
ఢిల్లీలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ: భూ ప్రకంపనలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. శుక్రవారం తెల్లవారుజామున 4: 25 గంటలకు సుమారు ఒక నిమిషం పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5 పాయింట్లుగా నమోదైంది. భూకంప కేంద్రం హరియాణాలోని రోహ్‌తక్ సమీపంలో భూమిలోపల 22 కిలోమీటర్ల లోతులో ఉందని భూకంప అధ్యయన సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.