మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత!
చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ కమ్యూనిటీ చేపట్టిన ఉద్యమం ఉధృత రూపం దాల్చటంతో హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యమ ప్రభావం ప్రబలంగా ఉన్నటువంటి రోహ్తక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమకు బీసీ లేదా ఓబీసీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆరు రోజులుగా జాట్లు చేస్తున్న నిరసణ కార్యక్రమాల్లో పలు హిసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
రోహ్తక్లో జాట్లు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం హింసాత్మకంగా మారడంతో 15 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వదంతులు వేగంగా వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జాట్ల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం ఆల్పార్టీ మీటింగ్కు పిలుపునిచ్చారు.