నల్లధనం మార్చేవారిని వదలిపెట్టేది లేదు
ఆర్థికశాఖ హెచ్చరిక...
న్యూఢిల్లీ: నల్లధనం మార్పిడిలో ఉన్న వారికి కేంద్ర ఆర్థిక శాఖ గట్టి హెచ్చరిక జారీ చేసింది. మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడేవారిని, అక్రమార్జనను సక్రమంగా మార్చుకునే వారిని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేసింది. చట్ట బద్ధమైన సంస్థలు ఇప్పటికే ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో ఉన్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
ఫలితాలు ఇప్పటికే కనిపించాయని, రానున్న రోజుల్లో మరింత ప్రస్ఫుటమవుతాయన్నారు. పన్ను చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం ఇటీవలే లోక్ సభలో ఓ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఇది చట్టరూపం దాలిస్తే నోట్ల రద్దు ప్రకటన తర్వాత లెక్కలు చూపని ఆదాయంతో పట్టుబడ్డ వారి నుంచి పన్నులు, జరిమానా రూపంలో 85 శాతం రాబట్టనున్నట్టు ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పటికే తెలిపారు.