ఆపరేషన్ బ్లాక్‌మనీ
Published Fri, Nov 18 2016 2:12 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : నల్లధనాన్ని మార్చుకునేందుకు అధికార పార్టీ నేతలు కొత్త వ్యూహం పన్నారు. డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని పాత పెద్దనోట్లను మార్చే పనిలో పడ్డారు. తమకు అనుకూలంగా ఉన్న గ్రూపులను ఇందుకు ఎంచుకుంటున్నారు. ఆయా గ్రూపుల్లోని సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణం ఏమాత్రం ఉందో తెలుసుకుని వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. డ్వాక్రా మహిళలు పాత రుణం చెల్లిస్తే మరోసారి రుణం తీసుకునే అవకాశం ఉండటంతో.. తాము కట్టిన సొమ్మును కొత్త రుణం వచ్చాక తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు డీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ.. డ్వాక్రా గ్రూపులను తమకు అనుకూలంగా పనిచేయించేలా చూడాలని కోరుతున్నారు.
జ¯ŒSధ¯ŒS ఖాతాలపై ఆంక్షలతో..
పేదలు, మహిళలు ప్రారంభించిన జ¯ŒSధ¯ŒS ఖాతాలను కొందరు నల్ల ధనం మార్పిడికి ఉపయోగించుకుంటున్నారనే అనుమానంతో ఈ ఖాతాల్లో రూ.50 వేలకు మించి పాతనోట్లను జమ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలను చెల్లించే ఎత్తుగడతో టీడీపీ నేతలు ముందుకు వస్తున్నట్టు సమాచారం.
నగదు రాలేదంటూ బోర్డులు
చాలా బ్యాంకుల వద్ద నగదు ఇంకా రాలేదంటూ గురువారం ఉదయం బోర్డులు పెట్టారు. తపాలా కార్యాలయాల్లోనూ నగదు ఇవ్వలేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. లింగపాలెం మండలం కె.గోకవరం పోస్టాఫీసులో రూ.500, రూ.1000 పాతనోట్లకు చిల్లర ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. మరోవైపు కొత్త నోట్లపై ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో వీటిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే ప్రబుద్ధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం పంచాయతీ పరిధిలోని గౌరీ శంకరపురం గ్రామానికి చెందిన పొలిమెరశెట్టి సత్యనారాయణ, బొబ్బేటి ఆనందరావు రూ.2 వేల నోటును కలర్ జిరాక్సు తీయించి, దాంతో మక్కినవారిగూడెంలోని మద్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.
పెళ్లిళ్లకు ఊరట
పెళ్లికి సంబంధించి ఆ కుటుంబ స్వీయ ధ్రువీకరణ, పా¯ŒS కార్డు వివరాలు సమర్పించి ఒకేసారి రూ.2.50 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించడం కొంత ఊరటనిస్తోంది. వరుడు లేదా వధువు, వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించారు. పెళ్లి నిమిత్తం ఒకరి ఖాతా నుంచి మాత్రమే అనుమతించిన మేరకు డబ్బు తీశామని.. మరే ఖాతా నుంచి పెళ్లి పేరుతో నగదు తీసుకోలేదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సదరు వ్యక్తి బ్యాంకులో అందజేయాలి. పంట రుణం పొందిన, కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేలు నగదు తీసుకునే అవకాశం కల్పించారు.
Advertisement