cancelled notes
-
‘పిల్లల నోట్ల’తో పంగనామం
జంగారెడ్డిగూడెం : నోట్ల మార్పిడి పేరిట పిల్లలు ఆడుకునే నోట్లు ఇచ్చి రూ.నాలుగు లక్షల కొత్తనోట్లతో ఉండాయించిన ఓ ముఠా ఘరానా మోసమిది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కమీషన్‌కు కక్కుర్తిపడి మధ్యవర్తిగా ఉన్న పాపానికి ఓ వ్యక్తి చిత్రవధ అనుభవిస్తున్నాడు. దీనిపై బాధితుడు దాట్ల రవీందర్ పోలీసులను ఆశ్రయించాడు. అతని కథనం ప్రకారం.. గోపాలపురం మండలం హుకుంపేటకు చెందిన గిరిజనుడైన దాట్ల రవీందర్‌కు డిసెంబర్ 20న ఏలేటి శేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తమ వద్ద రూ.5లక్షల విలువైన రూ.500 పాత నోట్లు ఉన్నాయని, కొత్తనోట్లు కావాలని అడిగాడు. రూ.4 లక్షలు ఇస్తే మిగిలిన రూ.లక్ష కమీష¯ŒSగా తీసుకోవచ్చని ఆశ చూపాడు. దీంతో రవీందర్ తన వద్ద కొత్తనోట్లు లేవని, గోపాలపురానికి చెందిన సుతాపల్లి రామకృష్ణ వద్ద ఉన్నాయని, తాను మార్చి పెడతానని ఒప్పుకున్నాడు. సుతాపల్లి రామకృష్ణతో మాట్లాడి అతనికి పాత రూ.500 నోట్లు రూ.4.50 లక్షలు ఇచ్చేలా, మిగిలిన రూ. 50వేలు రవీందర్ కమీషన్‌గా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు డిసెంబర్ 21న సాయంత్రం గోపాలపురం గుడ్డిగూడెం రోడ్డులోని నిద్రగన్నేరు చెట్టు వద్దకు నగదు తీసుకుని రావాలని జంగారెడ్డిగూడెంలో సెల్‌షాపు నిర్వహిస్తున్న వెంకట్ రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో రవీందర్, సుతాపల్లి రామకృష్ణ , త్రినా«థ్ అనే మరోవ్యక్తి రూ.4 లక్షలు (రూ.2వేల కొత్తనోట్లు) తీసుకుని వెళ్లారు. అక్కడకు వంశీ, కోన రవి అలియాస్ జాన్ అనే వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి మైకా కవర్లో ప్యాక్ చేసిన రూ.500 పాత నోట్ల కట్టలు తెచ్చి వీరికిచ్చి, వీరి నుంచి కొత్త రూ. 2వేల నోట్లు రూ.4లక్షలు తీసుకుని మోటార్‌సైకిల్‌పై వేగంగా వెళ్లిపోయారు. మైకా కవర్లో ఉన్న బండిల్ తీసి చూసే సరికి అవి పిల్లలు ఆడుకునే చిల్ర్టన్ బ్యాంక్ రూ.500నోట్లుగా గుర్తించారు. దీంతో అసలు నగదు ఇచ్చిన సుతాపల్లి రామకృష్ణ గోపాలపురంలోని ఒక టీడీపీ నేత వద్ద అదే రోజు రాత్రి పంచాయితీ పెట్టాడు. దీంతో దాట్ల రవీందర్‌తోపాటు అతనితో ఉన్న స్నేహితుడు ప్రసాద్‌ను టీడీపీ నేత పిలిపించి నిర్బంధించాడు. పోలీసులకు ఇవ్వాలని రవీందర్ నుంచి రూ.25వేలు తీసుకున్నాడు. అయినా వారిని వదలకుండా ఆ రోజు రాత్రంతా ఇద్దరినీ నిర్బంధించి తీవ్రంగా కొట్టాడు. డిసెంబర్ 22న సాయంత్రం వారి నుంచి రెండు ఖాళీ చెక్కులు, రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని వదిలారు. సుతాపల్లి రామకృష్ణ పోగొట్టుకున్న రూ.నాలుగు లక్షల్లో రూ.లక్షను డిసెంబర్ 31న రవీందర్ చెల్లించాడు. మిగిలిన సొమ్ము కోసం గోపాలపురానికి చెందిన టీడీపీ నేత రవీందర్‌ను వేధిస్తున్నాడు. దీంతో రవీందర్ ఈనెల 4న పోలీసులను ఆశ్రయించాడు. దొంగనోట్ల ముఠా పనే దొంగనోట్లు మార్చే కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి రవీందర్‌కు ఉచ్చువేసినట్ట తెలుస్తోంది. రవీందర్ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న వ్యక్తులు గతంలో దొంగనోట్ల కేసులో అరెస్టైన వారే. ద్వారకాతిరుమల మండలం తూరల లక్షీ్మపురం గ్రామానికి చెందిన సుంకర ఆంజనేయులు, కోన రవి, జంగారెడ్డిగూడానికి చెందిన వెంకట్ , వంశీ, గోపాలపురం మండలం పెద్దగూడానికి చెందిన ఏలేటి శేఖర్, మధు, బుచ్చియపాలెంకు చెందిన కొండే ప్రభాకర్ ఒక ముఠాగా ఏర్పడి ఏలేటి శేఖర్ ద్వారా రవీందర్‌కు ఫోన్ చేయించి రూ.నాలుగు లక్షల కొత్తనోట్లు కొట్టేశారు. 4న పోలీసులకు ఫిర్యాదు ఈనెల 4న రవీందర్ జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావుకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ గోపాలపురం పోలీసులకు కేసు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం మొత్తం తనకు తెలుసునని ప్రభాకర్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. తాను వ్యవహారం సెటిల్చేస్తానని, రూ. 4లక్షలు అంతా పంచేసుకున్నారని, తనకు రూ.లక్ష ఇస్తే వ్యవహారం సెటిల్ చేస్తానని రవీందర్‌కు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఇంతలో పూర్వం నుంచి దొంగనోట్ల కేసుల్లో నిందితుడిగా ఉన్న సుంకర ఆంజనేయులును తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి పోలీసులు విచారణ కోసం తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పిల్లలు ఆడుకునే చిల్ర్టన్ బ్యాంక్ రూ.500 నోట్లు గోపాలపురానికి చెందిన తెలుగుదేశం నాయకుడు తనవద్దే ఉంచుకుని రవీందర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. విచారణ చేస్తున్నాం నోట్ల మార్పిడి కేసును విచారణ చేస్తున్నాం. దీనిని లోతుగా విచారణ చేయాలని జంగారెడ్డిగూడెం సీఐ, గోపాలపురం ఎస్సైలను ఆదేశించాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం. దీనిపై ప్రత్యేక సిబ్బందిని కూడా నియమిస్తాం – జె.వెంకటరావు, డీఎస్పీ -
నల్ల వ్యవహారం బట్టబయలు
తణుకు : ఒకే ఆధార్ కార్డు.. 50 జిరాక్సు కాపీలతో నగదు మార్పిడి చేసిన వ్యవహారం బట్టబయలైంది. ఇతర ఖాతాల ద్వారా కొత్తనోట్లు బదిలీ చేసిన వ్యవహారం వెలుగుచూసింది. తణుకు ఎస్బీఐ ప్రధాన కేంద్రంగా సాగిన అక్రమ లావాదేవీలు బయటపడటంతో.. దీనికి బాధ్యుడిగా భావిస్తూ ఆ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. బడా బాబులకు నోట్లు కట్టబెట్టడానికి కొందరు బ్యాంకు అధికారులు సహకరిస్తున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా దర్యాప్తు మొదలైంది. సుమారు వారం రోజులపాటు తణుకు ఎస్బీఐ ప్రధాన శాఖలో ఆర్బీఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 9, 10, 11 తేదీల్లో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు అధికారులు లావాదేవీలు జరిపినట్టు భావిస్తున్నారు. ఏజీఎం కృష్ణారావును గత బుధవారమే విజయవాడ కేంద్ర కార్యాలయానికి అటాచ్ చేసి టి.సునిల్‌కుమార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదినుంచీ అనుమానమే.. కొందరు నల్ల కుబేరులకు నోట్లు చేరవేతలో తణుకు పట్టణంలోని కొన్ని బ్యాంకులు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇందులో తణుకు ఎస్బీఐ శాఖ ప్రధాన భూమిక పోషించినట్టు సమాచారం. సాధారణంగా ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ఎస్బీఐ శాఖలను రిజర్వు బ్యాంకు చెస్ట్లుగా పిలుస్తుంటారు. రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా ఇక్కడికే నగదు వస్తుంటుంది. అయితే నోట్ల్ల రద్దు అనంతరం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తణుకు చెస్ట్‌లో రూ.10 కోట్లు పరిమితి కాగా సాధారణ రోజుల్లో రోజుకు రూ.10 కోట్లు లావాదేవీలు జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం రోజుకు రూ.కోటిలోపు నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత 9, 10, 11 తేదీల్లో నగదు చెల్లింపుల్లో రిజర్వు బ్యాంకు నిబంధనలు పాటించాలనే ఆదేశాలున్నాయి. వాటిని బేఖాతరు చేస్తూ పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపినట్టు భోగట్టా. నిబంధనల మేరకు ఖాతాలున్న వారికి వారానికి రూ.24 వేల చొప్పున నెలకు రూ. 96 వేలు పొందే అవకాశం ఉంది. కరెంట్ ఖాతాదారు వారానికి రూ.50 వేల చొప్పున నెలకు రూ.2 లక్షలు మాత్రమే తీసుకోవాలి. బ్యాంక్ ఖాతాలు లేనివారి నుంచి రోజుకు రూ.4 వేలు పాత నోట్లు తీసుకుని అదే మొత్తంలో కొత్త నోట్లు ఇవ్వాలనే నిబంధన విధించారు. పా¯ŒSకార్డు లేని వారి నుంచి రూ.49 వేలు పరిమితి వరకు డిపాజిట్లు చేయించుకున్నారు. అయితే బడాబాబుల నుంచి అందిన లక్షలాది రూపాయలను నమ్మకస్తుల ఖాతాల్లోకి రూ.49 వేలు చొప్పున పాత నోట్లు భారీగా డిపాజిట్ చేసి, తరువాత వారి ఖాతాలకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు ఎస్బీఐ ఏజీఎం కృష్ణారావు సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఏజీఎం కృష్ణారావు ఎవరెవరికి సహకరించారు, ఎంత మొత్తంలో నల్లధనం మారిందనే విషయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వ్యవహారం బట్టబయలు కావడంతో ఎవరి పేర్లు బయటకు వస్తాయో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పట్టణంలోని మరో జాతీయ బ్యాంకులోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయనే ప్రచారం ఉంది. దీనిపైనా అధికారులు ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
ఆపరేషన్ బ్లాక్‌మనీ
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : నల్లధనాన్ని మార్చుకునేందుకు అధికార పార్టీ నేతలు కొత్త వ్యూహం పన్నారు. డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని పాత పెద్దనోట్లను మార్చే పనిలో పడ్డారు. తమకు అనుకూలంగా ఉన్న గ్రూపులను ఇందుకు ఎంచుకుంటున్నారు. ఆయా గ్రూపుల్లోని సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణం ఏమాత్రం ఉందో తెలుసుకుని వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. డ్వాక్రా మహిళలు పాత రుణం చెల్లిస్తే మరోసారి రుణం తీసుకునే అవకాశం ఉండటంతో.. తాము కట్టిన సొమ్మును కొత్త రుణం వచ్చాక తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు డీఆర్డీఏ అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ.. డ్వాక్రా గ్రూపులను తమకు అనుకూలంగా పనిచేయించేలా చూడాలని కోరుతున్నారు. జ¯ŒSధ¯ŒS ఖాతాలపై ఆంక్షలతో.. పేదలు, మహిళలు ప్రారంభించిన జ¯ŒSధ¯ŒS ఖాతాలను కొందరు నల్ల ధనం మార్పిడికి ఉపయోగించుకుంటున్నారనే అనుమానంతో ఈ ఖాతాల్లో రూ.50 వేలకు మించి పాతనోట్లను జమ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలను చెల్లించే ఎత్తుగడతో టీడీపీ నేతలు ముందుకు వస్తున్నట్టు సమాచారం. నగదు రాలేదంటూ బోర్డులు చాలా బ్యాంకుల వద్ద నగదు ఇంకా రాలేదంటూ గురువారం ఉదయం బోర్డులు పెట్టారు. తపాలా కార్యాలయాల్లోనూ నగదు ఇవ్వలేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. లింగపాలెం మండలం కె.గోకవరం పోస్టాఫీసులో రూ.500, రూ.1000 పాతనోట్లకు చిల్లర ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. మరోవైపు కొత్త నోట్లపై ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో వీటిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే ప్రబుద్ధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం పంచాయతీ పరిధిలోని గౌరీ శంకరపురం గ్రామానికి చెందిన పొలిమెరశెట్టి సత్యనారాయణ, బొబ్బేటి ఆనందరావు రూ.2 వేల నోటును కలర్ జిరాక్సు తీయించి, దాంతో మక్కినవారిగూడెంలోని మద్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. పెళ్లిళ్లకు ఊరట పెళ్లికి సంబంధించి ఆ కుటుంబ స్వీయ ధ్రువీకరణ, పా¯ŒS కార్డు వివరాలు సమర్పించి ఒకేసారి రూ.2.50 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించడం కొంత ఊరటనిస్తోంది. వరుడు లేదా వధువు, వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించారు. పెళ్లి నిమిత్తం ఒకరి ఖాతా నుంచి మాత్రమే అనుమతించిన మేరకు డబ్బు తీశామని.. మరే ఖాతా నుంచి పెళ్లి పేరుతో నగదు తీసుకోలేదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సదరు వ్యక్తి బ్యాంకులో అందజేయాలి. పంట రుణం పొందిన, కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేలు నగదు తీసుకునే అవకాశం కల్పించారు.