ఆత్మకూరులో రూ. 2వేల దొంగనోట్లు
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో రూ. 2 వేల దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఆర్టీసీ కండెక్టర్‌ను దొంగ నోటుతో ఓ వ్యక్తి బోల్తా కొట్టించాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కండెక్టర్ శివుడు వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. శ్రీశైలానికి వెళ్లి వచ్చామని, కర్నూలు వెళ్లేందుకు రూ. 2వేలకు చిల్లర ఇవ్వాలని నకిలీనోటు ఇచ్చి చిల్లర తీసుకుని జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కండెక్టర్ కలెక‌్షన్‌ను చెల్లించేందుకు క్యాష్ కౌంటర్‌కు వెళ్లాడు. కంట్రోలర్ నోట్లను చెక్ చేస్తుండగా రూ.2వేల నకిలీ నోటు బయటపడింది. ఈ నకిలీ నోటు నంబర్ 9బీఎం 608080. తనకు దొంగనోటు ఇచ్చిన వ్యక్తి కోసం బస్టాండ్‌తో పాటు చక్రం హోటల్, ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు గుర్తించేందుకు గాలించినా ఎక్కడా కనిపించలేదు. దీంతో కండెక్టర్ తన సొంత డబ్బును కౌంటర్‌లో చెల్లించాల్సి వచ్చింది.