
రూపాయి రికవరీ...
24 పైసలు లాభంతో 66.61
ముంబై: పాక్‌పై ఊహించని దాడుల నేపథ్యంలో గురువారం కుదేలైన రూపాయి శుక్రవారం రికవరీ అయింది. బ్యాంక్‌లు, ఎగుమతిదారుల తోడ్పాటు తో డాలర్‌తో రూపాయి మారకం 24 పైసలు బలపడి 66.61 వద్ద ముగిసింది. గురువారం పాక్‌పై దాడులతో రూపాయి 39 పైసలు పతనమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో ఇదే అతి పెద్ద పతనం. డాషే బ్యాంక్ ఆర్థిక స్థితిగతులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ, ఒడిదుడుకులకు లోనైనా .
శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం రూపాయిపై సానుకూల ప్రభావం చూపించింది. బ్యాంక్‌లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కలసివచ్చిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఫలితంగా దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులు జోరుగా రానున్నాయనే అంచనాలు రూపాయి బలపడటానికి తోడ్పాటునందించాయని పేర్కొన్నారు.