
ఆ నోట్లు మార్చుకునేందుకు పది రోజులే ఉంది
న్యూఢిల్లీ: కరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన గడువుదగ్గరకొచ్చింది. మరో పది రోజుల్లోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు పూర్వంనాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్త నోట్లు తీసుకోవాల్సి ఉంటుంది. 2005కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగదారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్ని కారణాలవల్ల గడువును రెండుసార్లు పొడిగించారు. జూన్ 30లోగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించాలని చెప్పారు. దీంతో గడువు దగ్గరికొచ్చింది. కొన్ని అంశాల్లో ఇబ్బందులు తలెత్తడంతోపాటు నకిలీ నోట్లు కూడా చెలామణి అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా గత నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాస్తవానికి, నల్లధనం బయటకు రప్పించాలనే ఉద్దేశంతో కూడా దీనిని ప్రధానంగా తెరముందుకు తీసుకొచ్చారు.