భారతదేశంలో రూ. 2000 నోట్ల డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ గురించి ఆర్‌బీఐ ప్రకటించి ఇప్పటికే మూడు నెలల కంటే కూడా ఎక్కువైంది. ప్రారంభంలో 2023 సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని ప్రకటించగా.. రావాల్సిన నోట్లు ఇంకా ఉండటం వల్ల ఈ గడువుని అక్టోబర్ 07కి పొడిగించారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి? ఎక్కడ డిపాజిట్ చేసుకోవాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికి తిరిగి రావాల్సిన నోట్లు 3.37 శాతం ఉన్నాయి, అంటే సుమారు రూ. 12000 కోట్లు వెనక్కి రావాల్సి ఉంది. కాగా 96 శాతం కంటే ఎక్కువ నోట్లు వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ రూ. 2000 నోట్లను మార్చుకోవాలంటే నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవడానికి వెసులుబాటు ఉండదు.
రూ. 2000 నోట్లు కలిగిన కస్టమర్లు లేదా సంస్థలు నేరుగా 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. వీరు ఒక్క సారికి రూ. 20,000 నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు.
ఇదీ చదవండి: మెకానిక్ నుంచి వేలకోట్ల సామ్రాజ్యం.. ఎక్కడైతే అడుగుపెట్టలేడని ఎగతాళి చేశారో అక్కడే..
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment