
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారంకూడా 15 పైసలు లాభపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 69.22 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం రూపాయి పటిష్ట బాటన నడిచింది. 80 పైసలు లాభపడింది. గతవారంకూడా రూపాయి ఒకశాతంపైగా బలపడింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం తాజాగా రూపాయికి కలిసి వస్తోంది. నిజానికి ఈ సానుకూల అంశంతో రూపాయి మరింత బలపడాల్సి ఉంది. అయితే విదేశీ నిధులు వెనక్కు వెళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌పై తగ్గిన సెంటిమెంట్ రూపాయి జోష్‌పై నీళ్లు జల్లుతున్నాయి. కాగా క్రూడ్ ధరలు, ఎన్నికల ఫలితంపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో మే నెల మొత్తం రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
సమీప కాలంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని నాలుగు నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. రెండు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది.
Comments
Please login to add a commentAdd a comment