
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 34 పైసలు బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 71.56 వద్ద ముగిసింది. నవంబర్‌లో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు తగ్గినట్లు (అక్టోబర్‌లో 17.13 బిలియన్ డాలర్లు ఉన్న వాణిజ్యలోటు నవంబర్‌లో 16.67 బిలియన్ డాలర్లకు తగ్గింది) వెలువడిన గణాంకాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలోపేతం వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి.
అలాగే గ్లోబల్ మార్కెట్‌లో ప్రధాన దేశాల కరెన్సీలతో డాలర్ బలహీనత కూడా రూపాయి పటిష్టతకు తోడయ్యింది. డాలర్ మారకంలో 71.84 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 71.51ని తాకింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ 69 స్థాయిని చూసినా, ఆ స్థాయిలో ఎక్కువ రోజులు నిలబడకుండా, 71–72 స్థాయిలో తిరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment