
అంతర్జాతీయంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర పటిష్టంగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఔన్స్ ధర 1,300 డాలర్లపైన కొనసాగినంతకాలం పసిడిది బులిష్ ధోరణిగానే పరిగణించాల్సి ఉంటుందన్నది వారి విశ్లేషణ. శుక్రవారంతో ముగిసిన వారంలో ధర ఒక దశలో 1,307 డాలర్లకు పడినా, అటుపై తిరిగి 1,318 డాలర్లకు చేరడం గమనార్హం. అయితే వారంవారీగా చూస్తే ఇది 4 డాలర్లు తక్కువ. 1,325 డాలర్ల వద్ద నిరోధమనీ, ఈ అడ్డంకిని అధిగమిస్తే, 1,340 డాలర్ల వరకూ పసిడి ధర పయనించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 2019, 2020ల్లో యూరోపియన్ యూనియన్ వృద్ధి మందగిస్తుందన్న వార్తలు గతవారం డాలర్ బలోపేతానికి ఊతం ఇచ్చాయి. అయితే వాణిజ్య యుద్ధం, అమెరికా వృద్ధికి సంబంధించి కీలక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు స్పీడ్‌పై అనిశ్చితి తొలగనంతవరకూ డాలర్ బలోపేత ధోరణి కొనసాగదని, ఇది పసిడి పెరుగుదలకు సానుకూల అంశమని విశ్లేషణ. శుక్రవారం డాలర్ ఇండెక్స్ ముగింపు 96.41.
భారత్‌లోనూ అదే ధోరణి...
ఇక భారత్‌లో చూస్తే, పసిడి ధర సమీపకాలంలో భారీగా తగ్గే అవకాశాలు లేవని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ధర పెరుగుదలతోపాటు డాలర్ మారకంలో రూపాయి బలహీనధోరణి ఇందుకు ప్రధాన కారణం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.33,242 వద్ద ముగిసింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల పసిడి ధర రూ.33,980 వద్ద ముగిసింది.

Comments
Please login to add a commentAdd a comment