
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలహీనత, అధిక ధరలు వెరసి సమీప కాలంలో ఆభరణాల రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల అంతర్జాతీయ పసిడి ధర తగ్గినా, ఆ ప్రభావం దేశీయంగా ఉండదన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కేర్ రేటింగ్స్ విడుదల చేసిన అంశాల్లో ముఖ్యమైనవి...
♦ సమీప భవిష్యత్తులో రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పరిశ్రమలో ఎగుమతులు తగ్గుతున్నాయి.
♦ ఇక్కడ ఒక చిన్న ఆశాకిరణం కూడా కనిపిస్తోంది. చైనా ఇటీవల ఆభరణాలపై దిగుమ తి సుంకాలను తగ్గించింది. అవకాశాలను వినియోగించుకుంటే, దేశీయ పరిశ్రమకు ఇది ఒక సానుకూల అంశం. 2018 మే నెలలో ఈ రంగం ఎగుమతుల్లో అసలు వృద్దిలేకపోగా, 11 శాతం క్షీణత నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment