దేశంలో విదేశీ మారకం నిల్వలు(ఫారెక్స్) క్రమంగా పడిపోతున్నాయి. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో కీలక అంశాలను ప్రస్తావించింది. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.82 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది.
అంతకుముందు వారంలో ఈ నిలువలు 5.401 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2021లో రికార్డు స్థాయిలో 642.453 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. మరోవైపు పసిడి రిజర్వులు పెరుగుతున్నాయి. తాజాగా 1.01 బిలియన్ డాలర్లమేర బంగారు రిజర్వులు పెరిగి 56.808 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్‌చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీ
పడిపోతున్న రూపాయి
ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రధానంగా అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో గత కొన్ని నెలలుగా రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. దీంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.793 బిలియన్ డాలర్లు తరిగిపోయి 560.86 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ తెలిపింది. డాలర్‌తోపాటు యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment