ముంబై : ఫెడరల్ రిజర్వు పాలసీ నిర్ణయం నేడు వెలువడనున్న నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి నాలుగు నెలల కనిష్టంలో 65.21గా నమోదైంది. 2017 నవంబర్ 16న రూపాయి విలువ ఈ స్థాయిలో ఉంది. 65.23గా ప్రారంభమైన రూపాయి విలువ, 65.19 వద్ద గరిష్ట స్థాయిని, 65.23 వద్ద కనిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. ఫెడరల్ రిజర్వు నేడు తన వడ్డీరేట్లను పెంచనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
రెండు రోజుల సమావేశ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు నిన్న భేటీ అయింది. ఈ ఏడాది మరో రెండు సార్లు ఫెడరల్ రిజర్వు తన వడ్డీరేట్లను పెంచనున్నట్టు తెలుస్తోంది. కొత్త చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడ్ కమిటీ నేడు కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశముందని సమాచారం. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1.5-1.75 శాతానికి చేరనున్నట్లు అత్యధికులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఫెడ్ నిర్ణయంపై ఎక్కువగా దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment