సాక్షి, హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన నాయకుల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్‌పై కామెంట్లు చేశారంటూ తనపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో ఆర్జీవీ మరోసారి కౌంటర్ ఎటాక్‌గా ముందుకొచ్చారు.
‘కొణిదెల నాగబాబు.. ఆయన తమ్ముడికి లేక అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు నాకు కాదు. నేను జనసేన మీదకాని పవన్ కల్యాణ్ మీద చేసిన ట్వీట్స్ పవన్ అభిమానిగా చేశాను. అది అర్ధం అవ్వకపోకడం నా దురదృష్టం.. అంతకన్నా ఎక్కువ పవన్ దురదృష్టం. కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే దాని తరువాత పవన్ కల్యాణ్ అవుట్ కమ్ ఏమిటో! జనమే చెపుతారు’ అంటూ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఈమేరకు ట్విటర్‌లో వీడియో రిలీజ్ చేశారు.
Hello @Pawankalyan gaaru , Konchem mee bhaijaaan gaarini choosukondi pic.twitter.com/8ih8kgxlDC
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2023
డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2023
Comments
Please login to add a commentAdd a comment