
బెర్లిన్: రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి విముక్తి కల్పించడానికి ఎదురుదాడికి దిగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన జెల్‌న్‌స్కీ ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కాల్జ్‌తో సమావేశమయ్యారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ మీడియాకు లక్ష్యమని తెలిపారు. తమ ప్రాంతాలను రష్యాపై నుంచి తీసుకుంటామన్నారు. రష్యాపై దాడికి దిగేటంత ఆయుధ సంపత్తి తమ దగ్గర లేదన్నారు. రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని చెప్పారు. తమకు అండదండగా ఉంటూ 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.