Germany tour
-
రష్యాపై ఎదురుదాడికి ఉక్రెయిన్ సన్నాహాలు!
బెర్లిన్: రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి విముక్తి కల్పించడానికి ఎదురుదాడికి దిగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన జెల్‌న్‌స్కీ ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కాల్జ్‌తో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ మీడియాకు లక్ష్యమని తెలిపారు. తమ ప్రాంతాలను రష్యాపై నుంచి తీసుకుంటామన్నారు. రష్యాపై దాడికి దిగేటంత ఆయుధ సంపత్తి తమ దగ్గర లేదన్నారు. రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని చెప్పారు. తమకు అండదండగా ఉంటూ 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్కు ధన్యవాదాలు తెలిపారు. -
‘ఉపేక్షిస్తే ఉగ్ర సంస్థలు పుట్టుకొస్తాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : అభివృద్ధి ప్రక్రియలో గిరిజనులు, దళితులు, మైనారిటీలను విస్మరిస్తే ఐఎస్ వంటి ఉగ్ర సంస్థలు పుట్టుకొస్తాయని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హెచ్చరించారు. వృద్ధి పరంపరలో అందరినీ భాగస్వాములను చేయాలని గిరిజనులు, దళితులు, మైనారిటీలను దూరం పెట్టడం ప్రమాదకరమని మోదీ సర్కార్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఏడు దశాబ్ధాల కిందట మనకు స్వతంత్రం లభించిన నేపథ్యంలో గ్రామీణ భారత్‌ను ఆధునిక భారత్‌గా ఆవిష్కరించామని అన్నారు. అభివృద్ధి ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేయడమనే విధానంతో అప్పుడు ముందుకెళ్లామన్నారు. మోదీ ప్రభుత్వం అణగారిన వర్గాలను వృద్ధి ప్రక్రియలో విస్మరిస్తోందని, అభివృద్ధి ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడం ప్రమాదకరమని జర్మనీ పర్యటనలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ హెచ్చరించారు. నరేంద్ర మోదీ సర్కార్ హయాంలో పేదలకు సమాన అవకాశాలు దక్కకపోవడం, నిరుద్యోగం, మూకహత్యలు వంటి అనర్థాలు చోటుచేసుకున్నాయన్నారు. -
ప్రియాంకా, మోదీతో అలాగేనా!
జర్మనీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ పర్యటనలో ఉన్న ‘బేవాచ్ స్టార్’, బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా కలుసుకొని ఫొటో దిగిన తీరుపై సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. మోకాళ్ల పైవరకు కనిపించేలా పొట్టి గౌను ధరించి మోదీ పక్కన కూర్చొని ఫొటో దిగడం పట్ల వారంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ప్రియాంక! మీరు మన దేశ ప్రధాన మంత్రితో కలసి కూర్చున్నారు. మోకాళ్లు కనిపించకుండా దాచుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎలా?.. నీవు పెద్ద అంతర్జాతీయ తారవైతే కావచ్చు. ప్రధాని పట్ల కాస్త గౌరవంగా నడుచుకోవాలిగదా, ఒకసారి ఆయన పక్కన నీవు ఎలా కూర్చున్నావో చూసుకో.. ఆమెకు పెద్దలను ఎలా గౌరవించాలో తెలియదనుకుంటా. దేశ సంస్కృతిని కూడా ఆమె మరచిపోయినట్లున్నారు.. ఓ సెలబ్రిటీ, వాళ్ల ప్రధానమంత్రిని ఎలా గౌరవిస్తుందో చూడండి. మోడ్రన్‌గా ఉందామని ఆశిస్తున్న ఆధునిక మహిళా ప్రపంచం పట్ల నాకు జాలేస్తోంది.. ఆధునిక దుస్తులు వేసుకొని పాశ్చాత్య సంస్కృతిని అనుసరించాలనుకుంటే తప్పులేదు. మనకంటూ ఓ సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. ఎలాంటి సందర్భాల్లోనూ దాన్ని విస్మరించవద్దు.. ఆయనేమీ నీ బాయ్ ఫ్రెండ్ కాదు, మన ప్రధాన మంత్రి, అందులోనూ అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ముందు కాలి మీద కాలేసుకుని ఇంకెప్పుడూ కూర్చోకండి...’ అంటూ పండితుల నుంచి పామరుల దాకా, జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రియాంక చోప్రాను సమర్థిస్తూ కూడా సోషల్ మీడియాలో దేశీయంగా వ్యాఖ్యలు వచ్చాయి. ‘ప్రియాంకను, ఆమె దుస్తులను విమర్శించేవారికి నేను చెప్పేది ఒకటే, ఇది ఇస్లామిక్ దేశం కాదు, భారత దేశం. ప్రతి మహిళకు తనకిష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉంది. ప్రియాంక దుస్తులపై దృష్టి పెట్టేకంటే మీ పనులు మీరు చూసుకుంటే మంచిది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బెర్లిన్ నగంరలో మంగళవారం మోదీని కలసుకున్న ప్రియాంక చోప్రా, ఆ సందర్భంగా దిగిన రెండు ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఎంతో బిజీగా ఉన్న ప్రధాని మోదీ తనను కలసుకోవడానికి సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కూడా చెప్పారు. -
మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్: మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కలిసి ఎనిమిది ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశారు. భారత జర్మనీ ఒప్పందాల్లో ఫలితాలు రాబట్టే విషయాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టామని, ప్రధానంగా ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ రెండు దేశాలు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని ఆయన అభివర్ణించారు. భారతదేశం చాలా నమ్మదగ్గ భాగస్వామి అని ఏంజెలా మెర్కెల్ ప్రశంసించారు. జర్మనీ ఇక ఎంతో కాలం పాటు అమెరికా, బ్రిటన్ లాంటి సంప్రదాయ భాగస్వాముల మీద ఆధారపడటం కుదరదని ఆమె చెప్పారు. ఈయూ-ఇండియా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందాలపై ప్రధాని మోదీ, మెర్కెల్ చర్చించారు. చైనా ప్రతిపాదిస్తున్న సిల్క్ రోడ్ వాణిజ్యంపై తమకున్న అసంతృప్తిని మోదీ స్పష్టంగా చెప్పారు. వచ్చే నెలలో హాంబర్గ్‌లో జరిగే జి20 సదస్సులో వీరిద్దరూ మరోసారి భేటీ కానున్నారు. అప్పుడు దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలో చైనా సైనిక విస్తరణ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్, జర్మనీలు చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, పెద్ద ఆర్థిక వ్యవస్థలని, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో కీలక భాగస్వాములని మోదీ అభివర్ణించారు. జర్మనీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన స్పెయిన్, ఫ్రాన్స్, రష్యాలలో కూడా పర్యటించనున్నారు. -
జర్మనీ పర్యటనకు వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం రాత్రి జర్మనీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం జర్మనీలో జరిగే వంద స్మార్ట్ సిటీ మిషన్ సదస్సులో పాల్గొంటారు. జర్మనీ పర్యావరణ, భవనాల మంత్రి బార్బరా హెండ్రిక్స్ తో కలిసి వెంకయ్య మెట్రోపాలిటిన్ సొల్యూషన్ ఫెయిర్-2016ను సందర్శిస్తారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో సమావేశమవుతారు. కాగా భారత్‌లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం చేస్తామని జర్మనీ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూరు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం అందించనుంది. ఇక ఈ పర్యటనలోనే కేంద్రమంత్రి వెంకయ్య పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో భేటీ అవుతారు. అలాగే భారత్‌లో వంద ఆకర్షణీయ నగరాల నిర్మాణం గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. జర్మనీలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి ఉపయోగిస్తున్న సాంకేతికత, ఇతర పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. బుధవారం బెర్లిన్‌లోని ట్రాఫిక్ నిర్వహణ కేంద్రాన్ని వెంకయ్య సందర్శిస్తారు. బెర్లిన్‌లో రవాణా వ్యవస్థ డిజిటలైజేషన్‌పై చర్చించనున్నారు. అలాగే గురువారం ఉదయం జర్మనీ పార్లమెంటు భవనాన్ని సందర్శించి స్పీకర్‌తో భేటీ అవుతారు. పార్లమెంటు ఉపాధ్యక్షురాలు ఉల్లా ష్మిత్, ఇండోజర్మన్ పార్లమెంటరీ బృందంతో సమావేశమవుతారు. తిరిగి వెంకయ్య శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకుంటారు. -
నరేంద్ర మోదీ స్టైలే వేరు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశీ పర్యటనలోవున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్టైలే వేరు. ఆయన ఎప్పుడు, ఎక్కడవున్నా, ఆయా సందర్భాలనుబట్టి రకరకాల దుస్తులు మారుస్తూ అందరిని ఆకర్షిస్తారని అందరికి తెల్సిందే. ఆయన మహాచాలు అని, తన చుట్టూ కెమేరాలు ఎక్కడా ఉన్నాయో, ఎలాంటి భంగిమలో ఉంటే ఆక ర్శణీయంగా కనిపిస్తాడోనన్న విషయం ఆయనకు బాగా తెలుసని కొత్తగా తెలుస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ పర్యటన ముగించుకొని కెనడాలో అడుగుపెట్టిన మోదీ చాలా సందర్భాల్లో కెమేరా కన్నులోకి కన్నుపెట్టి చూశారు. కొన్ని సందర్భాల్లో అలా చూడకుండా కొంత పక్కకు చూసిన కెమేరా ఎక్కడుందో ఆయనకు బాగా తెలుసు. జర్మనీ పర్యటనలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో కలసి యధాలాపంగా తేనేరు సేవిస్తున్న, పక్కనున్న జర్మని మంత్రితో మాట్లాడుతూ ఎదురుగావున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపించే దృశ్యాలను చూసినా, జర్మనీ వ్యాపారవేత్తలతో దిగిన గ్రూపు ఫొటోను చూసినా ఆ విషయం మనందరికి కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఎటువైపు కెమేరాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు సమాచారమిచ్చే వేగులు కూడా ఆయన వెన్నంటే ఉంటారని కూడా చెబుతుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు 13 దేశాల్లో పర్యటించారు.