నరేంద్ర మోదీ స్టైలే వేరు! | Narendra modi style is different | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీ స్టైలే వేరు!

Published Wed, Apr 15 2015 2:57 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

నరేంద్ర మోదీ స్టైలే వేరు! - Sakshi

నరేంద్ర మోదీ స్టైలే వేరు!

న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశీ పర్యటనలోవున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్టైలే వేరు. ఆయన ఎప్పుడు, ఎక్కడవున్నా, ఆయా సందర్భాలనుబట్టి రకరకాల దుస్తులు మారుస్తూ అందరిని ఆకర్షిస్తారని అందరికి తెల్సిందే. ఆయన మహాచాలు అని, తన చుట్టూ కెమేరాలు ఎక్కడా ఉన్నాయో, ఎలాంటి భంగిమలో ఉంటే ఆక ర్శణీయంగా కనిపిస్తాడోనన్న విషయం ఆయనకు బాగా తెలుసని కొత్తగా తెలుస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ పర్యటన ముగించుకొని కెనడాలో అడుగుపెట్టిన మోదీ చాలా సందర్భాల్లో కెమేరా కన్నులోకి కన్నుపెట్టి చూశారు.

కొన్ని సందర్భాల్లో అలా చూడకుండా కొంత పక్కకు చూసిన కెమేరా ఎక్కడుందో ఆయనకు బాగా తెలుసు. జర్మనీ పర్యటనలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో కలసి యధాలాపంగా తేనేరు సేవిస్తున్న, పక్కనున్న జర్మని మంత్రితో మాట్లాడుతూ ఎదురుగావున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపించే దృశ్యాలను చూసినా, జర్మనీ వ్యాపారవేత్తలతో దిగిన గ్రూపు ఫొటోను చూసినా ఆ విషయం మనందరికి కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఎటువైపు కెమేరాలు ఉన్నాయో  ఎప్పటికప్పుడు సమాచారమిచ్చే వేగులు కూడా ఆయన వెన్నంటే ఉంటారని కూడా చెబుతుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు 13 దేశాల్లో పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement