IPL 2023, RCB Vs RR: భార్య అనుష్కకు కోహ్లి ముద్దుల వర్షం | Virat Kohli Passes Flying Kiss To Wife Anushka Sharma, Pics Viral - Sakshi
Sakshi News home page

Virat-Anushka: భార్య అనుష్కకు కోహ్లి ముద్దుల వర్షం

Published Sun, Apr 23 2023 8:54 PM | Last Updated on Mon, Apr 24 2023 11:13 AM

Virat Kohli Flying Kiss To Anushka At RCB Vs RR After Jaiswal Out - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్‌ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఇక రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా కోహ్లి చేసిన ఒక చర్య సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ హర్షల్‌ పటేల్‌ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్‌ భారీ షాట్‌కు యత్నించాడు. హర్షల్ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని లాంగాన్‌ దిశగా ఆడాడు. అక్కడే ఉ‍న్న కోహ్లి చేతుల్లో సురక్షితంగా పడింది. అంతే కోహ్లి.. స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్కకు ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అంతేకాదు  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement