'ఆ నవ్వుకే పడిపోయాడనుకుంటా..' | IPL 2023: Anushka Sharma Reaction-Viral Kohli Hits Fiery Fifty Vs DC | Sakshi
Sakshi News home page

Kohli-Anushka Sharma: 'ఆ నవ్వుకే పడిపోయాడనుకుంటా..'

Published Sat, Apr 15 2023 10:47 PM | Last Updated on Sat, Apr 15 2023 10:56 PM

IPL 2023: Anushka Sharma Reaction-Viral Kohli Hits Fiery Fifty Vs DC - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌16వ సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ రెండో విజయాన్ని నమోదు చేసింది. రెండు వరుస పరాజయాలతో డీలా పడిన ఆర్‌సీబీ సొంతగ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలిచింది. కోహ్లి అర్థసెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్‌సీబీ తడబడినప్పటికి ఆఖర్లో షాబాజ్‌ అహ్మద్‌, అనూజ్‌ రావత్‌లు విలువైన ఇన్నింగ్స్‌ ఆడడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కాగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌కు కోహ్లి భార్య అనుష్క శర్మ హాజరైంది. ఈ క్రమంలో కోహ్లి హాఫ్‌ సెంచరీ చేయగానే తన భర్తను అభినందిస్తూ అనుష్క చిరునవ్వుతో ఇచ్చిన స్టన్నింగ్‌ లుక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కోహ్లి కూడా ఫిఫ్టీ కొట్టగానే అనుష్క ఉన్న స్టాండ్స్‌వైపు తన బ్యాట్‌ను చూపిస్తూ మురిసిపోయాడు.

ఇక అభిమానులు దీనిపై స్పందిస్తూ.. ''కింగ్‌ ఎప్పుడు తన క్వీన్‌ను ఎప్పుడు నిరాశపరచడు''.. ''బహుశా ఆ నవ్వుకే కోహ్లి పడిపోయి ఉంటాడు..  దటీజ్‌ కింగ్‌ కోహ్లి#KIngKohli #ViratKohli '' అంటూ కామెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement