'పరుగులు చేస్తేనే.. ఫ్లైయింగ్ కిస్'
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి మైదానం నుంచి తన ప్రియురాలికి గాల్లో ముద్దులు ఇవ్వడాన్ని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సమర్థించాడు. అయితే పరుగుల వరద పారించినప్పుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలంటూ సరదాగా అన్నాడు. కాలంతో పాటు వచ్చిన మార్పులను స్వాగతిస్తామని చెప్పాడు.
'విరాట్ కోహ్లి సెంచరీ చేసి ప్రియురాలికి గాల్లో ముద్దు విసిరితే నాకేం అభ్యంతరం ఉండదు. కానీ పరుగులేమీ చేయకపోతే ఇబ్బంది. మేము క్రికెట్ ఆడినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. మేము వీటిని అంగీకరిస్తాం' అని కపిల్ పేర్కొన్నాడు.
మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లు గుంపుగా ఆలింగనం ఎందుకు చేసుకుంటున్నారో అర్థంకావడం లేదని వ్యంగ్యంగా అన్నాడు. 'డ్రెస్సింగ్ రూములో ఏం చేస్తున్నారు. కోడిగుడ్లు మాత్రమే తింటున్నారా' అని సరదాగా ప్రశ్నించాడు. భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 25 శాతం మత్రమే ఉన్నాయంటూ కారణాలు వివరించాడు కపిల్.