కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ మధ్యప్రదేశ్‌లో బైక్ రైడ్‌తో సందడి చేశారు. ఈ మేరకు ఆయన హెల్మట్ ధరించి భద్రతా సిబ్బంది నడుమ బ్లూ కార్పెట్‌పై బైక్‌తో రైడ్ చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ జంతు సంరక్షణ గురించి చర్చించాలనుకున్నఇద్దరు రైడర్‌లు రజత్ పరాశర్, సార్థక్‌లను కలిశారు.
ఈ క్రమంలో ఒక రైడర్ మాట్లాడుతూ...రాహుల్‌గాంధీ అద్భుతమైన వ్యక్తి, అతనిని కలిసినప్పటి నుంచి అతనిపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఆయన జంతు ప్రేమికుడు అని తెలుసు. అందువల్లే రాహుల్‌ని కలిసి రోడ్లపై జంతు మరణాలపై చర్చించాలనుకుంటున్నాను అని గాల్వియర్‌కి చెందిన సివిల్ ఇంజనీర్ రజత్ అన్నారు. రజత్ వీధి కుక్కల సంరక్షణ భాద్యతను చేపట్టిన జంతు ప్రేమికుడు.
ఈ జోడో యాత్రలో 10 నెలల జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన మార్వెల్ అనే కుక్క కూడా రాహుల్‌తో కలిసి పాల్గొని సందడి చేసింది. రాహుల్ కూడా సదరు జంతుకు ప్రేమికులని, ఆ కుక్కను తన యాత్రలో పాల్గోనమంటూ ఆహ్వానించారు. తన మార్కెల్‌కు ఈ యాత్ర కోసం శిక్షణ ఇచ్చానని, అది తన బైక్ వెనుక సీటులో ఊయల మాదిరిగా సెటప్ చేసిన దాంట్లో సౌకర్యవంతంగా కూర్చొని ఈ యాత్రలో పాల్గొంటుందని చెప్పారు జంతు ప్రేమికుడు రజత్. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ నేతృత్వంలో సుమారు 3500 కి.మీ పాదయాత్ర సెప్టెంబర్‌లో తమిళనాడు నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది దాదాపుగా సగం యాత్ర పూర్తిచేసుకోవడమే గాక ఈ యాత్ర జనవరిలో ముగియనుంది.
Watch: Rahul Gandhi's Bike Ride During #BharatJodoYatra In Madhya Pradesh https://t.co/q3qbFKbWh2 pic.twitter.com/yivEsNICea— NDTV (@ndtv) November 27, 2022
(చదవండి: బాక్సర్‌తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment