సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో ఆ కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షాద్‌నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆంక్షలు అమలు చేశారు. జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వాహనాలను ఒకే లేన్‌లో అనుమతించారు.
మరో లేన్‌లో వచ్చే వాహనాలను అమిత్ కాటన్ మిల్, బూర్గుల క్రాస్ రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్‌నగర్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి షాద్‌నగర్ వైపు వచ్చే వాహనాలను కేశంపేట క్రాస్ రోడ్, చటాన్‌పల్లి రైల్వే గేట్ మీదుగా మళ్లించారు. పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలను షాద్‌నగర్ క్రాస్ రోడ్, బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు మళ్లించారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా నేతలు తరలిరావడంతో ఆయా మార్గాలు రద్దీగా మారాయి.
సోమవారం రెండోరోజు ఇలా..
♦పరిగి నుంచి సిటీ వైపు వచ్చే వెహికిల్స్ షాద్‌నగగర్ క్రాస్ రోడ్, బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేట్ మీదుగా వెళ్లాలి.
♦సిటీ నుంచి షాద్‌నగర్‌కు వెళ్లే వెహికిల్స్ కొత్తూరు వై జంక్షన్, జేపీ దర్గా క్రాస్ రోడ్, నందిగామ, దస్కల్ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
♦జడ్చర్ల నుంచి షాద్‌నగర్ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికిల్స్ వన్‌వేలో వెళ్లాల్సి ఉంటుంది.
శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో..
♦మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
♦బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వాహనాలు పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్‌గూడ, గొల్లపల్లి, కిషన్‌గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
మూడో రోజు (నవంబర్ 1న)..
♦ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి.
♦బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్‌గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్‌ఆర్ అండర్‌పాస్, గగన్‌పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
చదవండి: తెలంగాణలో సీబీఐకి ‘నో ఎంట్రీ’.. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment