kannada language
-
బెంగళూరులో టెన్షన్.. టెన్షన్
-
బెంగళూరులో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు: కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు మొదలయ్యాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ బయట కన్నడ కాకుండా(ನಾಮ ಫಲಕಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತ್ರ) ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. #WATCH | Bengaluru: Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada. pic.twitter.com/ZMX5s9iJd0 — ANI (@ANI) December 27, 2023 ఈ మధ్యే యునెస్కో కెంపెగౌడ విమానాశ్రయానికి మోస్ట్ బ్యూటీఫుల్ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు ఇచ్చింది. ఈలోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు బెంగళూరు వ్యాప్తంగా హోటల్స్‌పైనా కన్నడ సంఘాలు దాడులకు దిగాయి. ఇంగ్లీష్‌లో నేమ్ ప్లేట్స్ ఉన్న హోటళ్లలోకి దూసుకెళ్లాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇదిలా ఉంటే.. దుకాణాలకు ఫిబ్రవరి చివరికల్లా కన్నడ భాషలో నేమ్ ప్లేట్స్ గనుక ఉండకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవంటూ Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) హెచ్చరించింది కూడా. -
'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం
బెంగళూరు: బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలో వాణిజ్య దుకాణాలకు ఉండే బోర్డులను కన్నడలోనే ఉంచాలని బెంగళూరు నగర మహాపాలిక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. నేమ్ ప్లేట్లపై 60 శాతం కన్నడ పదాలని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ తెలిపారు. కర్ణాటక రక్షణ వేదిక (కెఆర్‌వి) సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. "నగరంలో 1400 కి.మీ మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాలను మండలాల వారీగా సర్వే చేసి.. అనంతరం 60 శాతం కన్నడ వాడని దుకాణాలకు నోటీసులు ఇస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత కన్నడ భాషా నేమ్ప్లేట్లను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 లోగా సమయం ఇస్తాం. ”అని గిరి నాథ్ చెప్పారు. కొత్త ఆదేశాల తర్వాత కేఆర్‌వి మద్దతుదారుడు దుకాణాదారులను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇది కర్ణాటక. కన్నడ మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రానికి గర్వకారణం. మీ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మార్వాడీలందరికీ కన్నడ రావాల్సిందే.' అని ఓ మహిళ బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాల్సిందేనని సీఎం సిద్ధరామయ్య గత అక్టోబర్‌లో ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అప్పట్లోనే కన్నడ వర్సెస్ హిందీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్య గతంలోనూ కన్నడ భాషపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగులకు కన్నడ తప్పకుండా రావాలని ఆదేశించారు. ఇదీ చదవండి: Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు? -
కన్నడిగుల కోసం సాహిత్య వేదిక
సాక్షి, హైదరాబాద్: గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకోవడానికి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల సాహిత్యం, సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న కన్నడ భాష మాట్లాడే కన్నడిగుల కోసం సాహిత్యవేదికను పునర్నిర్మాణం చేయాలని సీఎం నిర్ణయించారు. అందుకోసం రూ.5 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటకవాసులు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాచిగూడలోని ‘కర్ణాటక సాహిత్య మందిరం’పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానికి సంబంధించిన అనుమతిపత్రాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు శుక్రవారం ప్రగతిభవన్‌లో అందచేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునేవిధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని అధికారులు, ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. -
Bharat Jodo Yatra: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం
సాక్షి, బళ్లారి/చిత్రదుర్గ: కర్ణాటక ప్రజలపై, కన్నడ భాషపై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన గురువారం కర్నాటకలోని మొళకాల్మూరులో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల్లో భాగంగానే కన్నడ భాషపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. కన్నడ ప్రజల, భాష జోలికి రావొద్దన్నారు. అవి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. రాహుల్ యాత్ర శుక్రవారం ఉదయం బళ్లారి జిల్లాలోకి ప్రవేశించనుంది. -
దయచేసి ఆ గ్రామాల పేర్లు మార్చొద్దు: మాజీ సీఎం
బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దల్(సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సోమవారం లేఖ రాశారు. కేరళలోని కాసరగాడ్ జిల్లాలో కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడాన్ని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరారు. వాటి పేర్లను మార్చినప్పటికి అర్థం మారదని, పాత పేర్లతోనే వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కేరళలో నివసిస్తున్న కన్నడిగుల సంప్రదాయాలను కాపాడటం కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రుల బాధ్యత. కన్నడ గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చినప్పటికి వాటి అర్థం మాత్రం మారదు. అందుకని, వాటి పేర్లను మార్చకుండా.. పాత కన్నడ పేర్లను కొనసాగించాలని కోరుకుంటున్నాను. కాసరగాడ్ భాషా సామరస్యానికి నిదర్శనంగా ఉంది. అక్కడ కన్నడ, మలయాళం మాట్లాడే ప్రజలు సమాన సంఖ్యలో ఉన్నప్పటికి సామరస్యంగా జీవిస్తున్నారు. భాషా ప్రాతిపదికన వాళ్లు ఎప్పుడూ గొడవలు పడలేదు. అలాంటి సామరస్యాన్ని భవిష్యత్తులో కూడా కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి : పంజాబ్‌లో మహిళలు సంతోషంగా లేరు : కేజ్రీవాల్ -
గూగుల్ నిర్వాకం.. కన్నడ ప్రజలు ఫైర్
బెంగళూరు: కన్నడ భాషకు సంబంధించి గూగుల్ సెర్చ్ ఫలితాలు నెట్టింట దుమారం రేపుతోందనే చెప్పాలి. ఇటీవల మనకి ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేయడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యంత వికారమైన భాష ఏంటని గూగుల్‌లో సెర్చ్ చేస్తే సమాధానంగా.. భారతదేశంలో వికారమైన భాష ఏమిటి? దీనికి సమాధానం కన్నడ, దక్షిణ భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది మాట్లాడే భాషని చూపించింది. దీనిపై కన్నడ ప్రజలు, రాజకీయ ప్రతినిధులు కూడా గూగుల్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని పై బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విటర్ ద్వారా స్పందించారు. ఆయన తన ట్వీట్లో.. విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కూడా ఒకటని తెలిపారు. 14 శాతాబ్దంలో జాఫ్రీ చౌసెర్ పుట్టకముందే కన్నడలో పురాణాలు ఉన్నాయన్నారు. అయినా ఇలా ఓ భాషను అవమానించడం గూగుల్ లాంటి ప్రముఖ సంస్థకు తగదని సూచించారు. ఇందుకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నారు. కన్నడ కంటే మంచి భాషా ఎదో చెప్పాలని అని ఒకరు ప్రశ్నించగా.. మరికొందరు గూగుల్‌ను భారత్‌లో బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Home to the great Vijayanagara Empire, #Kannada language has a rich heritage, a glorious legacy and a unique culture. One of the world’s oldest languages Kannada had great scholars who wrote epics much before Geoffrey Chaucer was born in the 14th century. Apologise @GoogleIndia. pic.twitter.com/Xie927D0mf — P C Mohan (@PCMohanMP) June 3, 2021 Show me a beautiful and better language than #Kannada i will wait 😇#KannadaQueenOfAllLanguages pic.twitter.com/muPkrn9Ik2 — Hemanth Shaiva 2.0 (@Hemanth__Shaiva) June 3, 2021 చదవండి: అక్కడ 295 గ్రామాల్లో కరోనా కేసులు లేవు.. ఇదే కారణమట -
నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీగా సాగిన ప్రచారం చరమాంకానికి చేరుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రతిష్టను పణంగా పెట్టి ఎన్నికల్లో విస్తతంగా ప్రచారం చేయగా, భవిష్యత్ ప్రధానిగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు అదే స్థాయిలో ప్రచారం చేశారు. మోదీ తన హోదాకు తగ్గట్టుగా స్టేడియంలు, విశాలమైన మైదానాల్లో కిక్కిర్సిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎల్సీడీ స్క్రీన్లు, రకరకాల కెమేరాలు అదనపు హంగును చేకూర్చాయి. అంత జనం, అంతటి తరలింపు లేకపోయిన వేలాది మంది ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. నరేంద్ర మోదీ తన సహజ భావజాలంతో, తనదైనా హావభావాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా, రాహుల్ గాంధీ కాస్త కొత్తగా అలవర్చుకున్న హావభావాలతో అలరించేందుకు ప్రయత్నించారు. 2013లో, నవంబర్‌లో బెంగళూరులో జరిగిన ఓ ర్యాలీలో కన్నడలో మాట్లాడడం ప్రారంభించిన నరేంద్ర మోదీ, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విరివిగా కన్నడలో మాట్లాడారు ప్రతి సమావేశంలో కన్నడ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించి ఆ తర్వాత హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ వచ్చారు. గత ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ తొలుత ఎక్కువగా హిందీలోనే మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశంలోనే మోదీ ప్రసంగిస్తుండగా, ప్రజలతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా అర్ధంతరంగా లేచిపోవడం కనిపించింది. కన్నడ ప్రజలకు హిందీ ఎక్కువగా రాదు. అప్పటి నుంచి మోదీ కన్నడతో మొదలుపెట్టి హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించి అభాసుపాలైన రాహుల్ గాంధీ, అప్పటి నుంచి కన్నడలో వీలైనంత తక్కువ మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులోనే ఎక్కువ మాట్లాడుతూ వస్తున్నారు. తుముకూరులో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ‘తుముకూరులోని నా సోదర సోదరీమణులారా, కర్ణాటకలోని నా సోదర సోదరీమణులారా, దేశంలోని సోదర సోదరీ మణులారా! మీకు ప్రణామంలు....’ అంటూ మోదీ ప్రసంగం కొనసాగుతుంది. సుదీర్ఘ పద బంధాలతో మాట్లాడే ఆయన మాటి మాటికి ఎడమ వైపు, కుడి వైపు తిరుగుతూ ప్రజలను సూటిగా ప్రశ్నిస్తూ ప్రసంగిస్తారు. అదే రాహుల్ గాంధీ ‘సోదర సోదరీమణులారా’ అంటూ మొదలు పెట్టి క్లుప్తమైన వ్యాక్యాలతో సూటిగా మాట్లాడుతారు. ‘ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పేదలు...పేదలు....పేదలు అని మాట్లాడూ వచ్చింది. ఇప్పుడు ఓ పేద తల్లి కుమారుడు ప్రధాన మంత్రి అవడంతో నోరు మూసుకుంది. పేదలు, పేదలు అంటూ ప్రజల కల్లల్లో ఇక దుమ్ముకొట్టలేమని తెలుసుకుని మానుకుంది. ఆధార్ కార్డు ద్వారా ఏమీ సాధించారని అడుగుతారు కొందరు, 12 అంకెలు గల ఆధార్ కార్డు ద్వారా నేడు ప్రభుత్వ ఖజానాకు 80 వేల కోట్ల రూపాయలను మిగిలించాం’ లాంటి వ్యాక్యలు మోదీ మాట తీరుకు ఉదాహరణ. ‘అమిత్ షా మొదటి సారి నిజం మాట్లాడారు, అత్యంత అవినీతి పరుడైన సిఎం యెడ్యూరప్పని. మరి అంతటి అవినీతిపరుడిని మళ్లీ సీఎం అభ్యర్థిగా ఎలా నిలబెట్టారు?’ అన్న వ్యాఖ్య రాహుల్ స్టైల్‌ను సూచిస్తోంది. ‘మోదీ గారు! ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు యువతకిస్తున్నారు, ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేశారు. వేశారా, లేదా?’ అంటూ రాహుల్ ఈ మధ్య కొత్త వ్యంగ్యాన్ని అందుకున్నారు. కాబోయే ప్రధాన మంత్రిని తానని రాహుల్ చెప్పుకోవడం ప్రారంభించినప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. కర్ణాటకలో 12 వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు బసవేశ్వరుడిని ఉద్దేశించి రాహుల్ గాంధీ తొలత ‘బసవ్జీ’ అంటూ సంబోధించి అభాసు పాలయ్యారు. ఆ తర్వాత ‘బసవన్న’ అంటూ సరిదిద్దుకొని ఆయన్ని మాత్రమే ఎక్కువగా ప్రస్థావిస్తూ వచ్చారు. మోదీ తరచు కన్నడలో మాట్లాడుతూ ‘కర్ణాటక కల్పతరువు. మహా పురుషులు పుట్టిన గడ్డ. బసవన్న, సిద్ధగంగా మఠం ఆచార్యులు, అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న, మహా శిల్పి జక్కనాచార్య అంతా ఇక్కడి వారే’ అంటూ మోదీ స్థానికుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆయన కూడా కన్నడ పదాలను తప్పుగా పలకడాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధ రామయ్య పట్టుకొని ఎప్పటికప్పుడు దుమ్ము దులుపుతూ వచ్చారు. జాతీయ నాయకులు ఎవరు, ఎన్ని విధాలుగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించినా పెద్దగా లాభమేమీ ఉండదు. కర్ణాటకలో ఓ నియోజకవర్గంలోని స్థానిక అంశాలే విజేతను నిర్ణయిస్తాయి. ఆ విషయంలో సిద్ధ రామయ్యవైపే ఇప్పటికీ ప్రజల మొగ్గు కనిపిస్తోంది. ‘నరేంద్ర మోదీకి అసలైన ప్రత్యర్థి రాహుల్ గాంధీ కాదు. సిద్ధ రామయ్యనే’ అని తటస్థులు కూడా వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే 1980 దశకం నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ విజయం సాధించిన దాఖలాలు లేవు. ఏదేమైనా ఈ నెల 15వరకు నిరీక్షించాల్సిందే. -
ఇవి భాషాప్రయుక్త ఎన్నికలు
గడచిన సంవత్సరం జూలైలో బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థకు చెందిన పలు స్టేషన్లు దాడికి గురయ్యాయి. ఆ దాడులన్నీ దాదాపు ఏకకాలంలోనే జరిగాయి కూడా. కన్నడ ఆందోళనకారులు, ముఖ్యంగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు హిందీలో రాసి ఉన్న బోర్డుల మీద నల్ల రంగు పూశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. వెంటనే మెట్రో రైల్ అధికారులు స్పందించి పరిస్థితి మరింత విషమించకుండా బోర్డుల గురించి ఉన్న ఆంక్షలు తొలగించారు. హిందీలో ఉన్న పేర్లను ఇంగ్లిష్, కన్నడ భాషలలో రాయిం చారు. ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు సాధారణంగా వాటిని విశాల దృక్పథం లేని, సంకుచిత మనస్తత్వం కలిగిన సంస్థల, వ్యక్తుల చర్యలంటూ కొట్టి పారవేయడం జరుగుతుంది. తాము చెప్పేది విని తీరాలన్నట్టు వ్యవహ రించే రౌడీ మూకల పనిగా కూడా అలాంటి చర్యలను నిరసించడం జరు గుతూ ఉంటుంది. కానీ ఈ నిరసన మాత్రం ప్రత్యేకమైనదే. కన్నడ భాషకు తగిన గౌరవం దక్కడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఉద్యోగుల మద్దతు కూడా ఈ ఆందో ళనకు ఉంది. కన్నడం అంటే చులకనా? నేను గత వారం బెంగళూరులో ఉన్నప్పుడు వసంత్ శెట్టి, వల్లీశ్ అనే ఇద్దరు భాషా శాస్త్రవేత్తలను కలుసుకున్నాను. వారిద్దరిలోనూ కనిపించిన సారూ ప్యత, కర్ణాటకలో కూడా ప్రాధాన్యక్రమంలో కన్నడకు హిందీ తరువాత స్థానంలోకి ¯ð డుతున్నారనే భావనే. కన్నడిగులకు హిందీ అనుసంధాన భాష కాలేదన్నది ఆ ఇద్దరి వాదన. మరొక విషయాన్ని శెట్టి చాలా ఆర్ద్రంగా చెప్పారు. కన్నడ భాషలో మాట్లాడని బ్యాంకు సిబ్బంది, తపాలా శాఖ సిబ్బంది ఉన్నారనీ, రైల్వేశాఖలో అయితే కన్నడను అసలు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి ధోరణే ప్రజలలో హిందీ పట్ల ఒకరకమైన భయాన్ని, తమ పట్ల తమకు అభద్రతా భావాన్ని కలిగిస్తున్నదని కూడా శెట్టి చెప్పారు. కానీ ఇది కేవలం భాషను గురించిన వ్యవహారం కాదు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాష గురించిన అంశం కన్నడిగుల ఉనికి, ఆత్మగౌరవాలతో ముడిపడిపోయింది. దీనికి తోడు హిందీలో ప్రసంగించేవారి కంటే, కన్నడ భాషలో ప్రసంగించేవారు తక్కువ అన్న భావం బలం పుంజు కుంటోంది. వల్లీశ్ చెప్పిన మరో అంశం చాలా కలవరపాటుకు గురిచేసింది. ఇంత వైవిధ్యం ఉన్న భారత్ వంటి దేశంలో భిన్నత్వాన్నీ, అందులోని అనే కానేక అస్తిత్వాలనీ ప్రభుత్వం గౌరవించాలని ఆయన అన్నారు. విద్యావం తుడైన ఒక కన్నడిగుడి అభిప్రాయం ఎలా ఉందో సుస్పష్టంగా గమనించడా నికి ఆయన మాటలలోనే ఆ విషయం చెబుతాను. ‘మనకి ఇండియన్ అన్న ఒక్క అస్తిత్వం మాత్రమే ఉందని ఎవరూ చెప్పలేరు. ఇది అన్నింటినీ తుడిచి పెట్టేస్తుంది. ఒకే అస్తిత్వాన్ని ఇతరుల మీద కూడా ప్రయోగించలేం. నీవు ఇండియన్‌వి అయితే హిందీని ఆమోదించు, కన్నడిగుడివి అని చెబితే నీవు తక్కువ రకం ఇండియన్‌వి అన్న ఊహలు భారత్ అన్న భావనతో మమేకం కావడానికి దోహదం చేయవు.’ అని చెప్పారు వల్లీశ్. ఇలా తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న అభిప్రాయం ఒక్క బెంగళూరులోనే కాదు, దక్షిణ భారత ప్రజలలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే త్రిభాషా సూత్రమనేది హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడానికి ఉద్దేశించిన పెద్ద మాయ అన్న భావన కూడా నానాటికి పెరుగుతున్నది. ఇది ఒక్క భాషకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. రామాయణ కావ్యం గురించే చూద్దాం. వాల్మీకి రామాయణం ఒక్కటే అసలైన రామాయణమని ఔత్తరాహుల దృఢాభి ప్రాయం. కానీ దక్షిణాదిన చాలా రామాయణాలు ఉన్నాయి. తమ తమ విశ్వాసాల గురించి, జన్మభూమి గురించి ప్రతి తరం విశ్లేషించుకోవడానికి ప్రతి సంస్కృతిలోనూ ఒక రామాయణం అవతరించడం కనిపిస్తుంది. ఏక శిలా సదృశమైన సంస్కృతినే అనుసరించాలని, అది అందరికీ సరిపోతుందని బలవంతం చేస్తే దానికి వెంటనే ప్రతిఘటన తప్పదు. కన్నడ విషయంలో గుర్తించవలసిన అంశం ఏమిటంటే, మిగిలిన భాషల మాదిరిగానే ఇది కూడా కేవలం ఒక మాధ్యమమని చెప్పడానికి పరిమితం కారాదు. ఇదొక ఉద్వేగం. తెగేదాకా లాగవద్దు ఇక ప్రత్యామ్నాయ అభిప్రాయం గురించి కూడా తెలుసుకోవాలి. రాష్ట్రాలని ప్రాంతీయవాదపు దీవులుగా మలచడం భారత్ ఒకే జాతి అన్న భావనకు ఆరోగ్యకరం కాదు. భారతదేశ రాష్ట్రాలను కలిపి ఉంచే శక్తి కలిగిన భావో ద్వేగమేదీ లేదన్న అనుమానం నుంచి ఇది జనిస్తుంది. నిజానికి ఈ వ్యతిరేకత వాస్తవమే. ఒక జాతిగా మనం సురక్షితంగానే ఉన్నాం. అయితే దేశం మరింత బలమైన సమాఖ్యగా ఎదగడానికీ, మరింతగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రా లకు అవకాశం కల్పించడానికీ సమయం ఆసన్నమైంది. అదే సమయంలో కర్ణాటక భాష సమస్యను తెగేదాకా లాగడం సరికాదు. అది హిందీ వ్యతిరేక ధోరణికి మళ్లిందంటే కర్ణాటక, బెంగళూరుల అభివృద్ధికి ఇతర ప్రాంతాల వారి ద్వారా జరిగిన కృషి మరుగున పడేటట్టు చేస్తుంది. గుర్తించవలసిన మరొక అంశం కూడా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది కన్నడ భాష ఒక్కటే కాదు. రాష్ట్రంలో ఇంకా తుళు, కొడవ, కొంకణి, ఆఖరికి హైదరాబాద్–కర్ణా టక పరిధిలో దక్కనీ ఉర్దూ కూడా ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే కన్నడ భాష ఆధిపత్యం పాత మైసూరు పరిధిలోని ఐదు లేదా ఆరు జిల్లాలకే పరిమితం. బెంగళూరుకు ఉన్న కాస్మోపోలిటన్ సంస్కృతిని కూడా మరచిపోలేం. కాబట్టి ప్రాంతీయ జ్వాలని ఒక స్థాయికి మించి మండనిస్తే దానితో చాలా చిక్కులు ఉంటాయి. బయటి ప్రాంతాల వారు వచ్చి రాష్ట్ర అభివృద్ధి యంత్రాంగానికి ఎంతో దోహదం చేశారన్న వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి కన్నడ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాలకు మించి ఎదగనిస్తే అవాంఛనీయ పరిణామాలు తప్పవు. కర్ణాటక రాష్ట్ర ఆదాయ వివరాలను ఒకసారి పరిశీలించండి. అందులో 60 శాతం ఒక్క బెంగళూరు మహా నగరం నుంచే వస్తుంది. ఉత్తర కర్ణాటక వంటి చాలా వెనుకపడిన ప్రాంతాన్ని ఆదుకుంటున్నది ఆ ఆదాయమే. ఇక ఈ ఎన్నికలలో బీజేపీని కలవరానికి గురి చేసే విషయం ఏదంటే, ఆ పార్టీ మీద ఉన్న ఉత్తరాది ముద్ర. అంటే హరియాణా, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు పరిమితమైన పార్టీ అన్న అవగాహన. ఇదే బీజేపీ వాద వ్యతిరేక, హిందీ భాషా వ్యతిరేక అభిప్రాయాలకు ఆస్కారం ఇస్తున్నది. భాష కొన్నిసార్లు ఆధిక్యం ప్రదర్శించడానికి ఉపయోగపడే సాధనమవు తుంది. కానీ బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ కొన్నిసార్లు భాషా వ్యతిరేక సెంటిమెంట్‌గా కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు జరగబోతున్న కర్ణాటక శాసన సభ ఎన్నికలలో భాష కీలకమైన అంశంగా మారింది. జాతీయవాద మనే బీజేపీ కార్డుకు పదును లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రాంతీయ అస్తి త్వాన్ని ముందుకు తేవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల రథాన్ని నడిపిస్తున్న సిద్ధరామయ్య తన రాజకీయ జీవితంలో ఎక్కు వగా, ఆఖరికి జనతా పరివార్‌లో ఉండగా కూడా అస్తిత్వ రాజకీయాలనే ప్రధానంగా ఆశ్రయించారు. అదే ఆయన బలం. జాతీయ వాదం, ఒకే జాతి, ఒకే పతాకం అనే బీజేపీ భావనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో కన్నడ అస్తిత్వం అనే కార్డును ప్రయోగి స్తున్నది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాతీ అస్మిత కార్డును ప్రయోగించిన తీరులోనే సిద్ధరామయ్య కర్ణాటకలో తన ఆయుధాన్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. హిందీ, హిందూ, హిందుస్తానీ పార్టీగా బీజేపీకి ఉన్న ముద్రను ఉపయోగించుకుని సిద్ధరామయ్య కన్నడ ఆత్మగౌరవం అనే కార్డును రంగం మీదకు తెచ్చారు. రాష్ట్ర పతాకం అన్న సిద్ధరామయ్య ఆలోచన కూడా మిగిలిన భారతదేశం కంటే కర్ణాటక ప్రత్యేక ఉనికిని ప్రకటించడానికేనని ఆయన ప్రత్యర్థులు చెబుతారు. నిజానికి కర్ణాటక తనకంటూ ఒక ప్రత్యేక పతాకాన్ని ఏర్పరచుకుంటే దాని గురించి మిగిలిన భారతదేశం కలతపడ వలసిన అవసరం ఉందా? క్రికెట్ రంగాన్ని చూడండి. అందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉప జాతీయతను ప్రదర్శిస్తూ ఉంటుంది. దీనిని దేశానికి అతీ తంగా ప్రదర్శిస్తున్న ఆత్మగౌరవమని అంటామా? అది కాదు. పైగా తన నగరం నుంచి లేదా ప్రాంతం నుంచి తమ ఉనికిని ప్రదర్శించడం పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఆనందిస్తారు. చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైద రాబాద్– ఇలా. కర్ణాటక పతాకం కూడా ఇంతకంటే భిన్నమైనది కాదు. కర్ణాటక ప్రజలకు పరీక్షే సిద్ధరామయ్య పన్నిన ఉచ్చులో తాము ఇరుక్కున్నామన్న వాస్తవాన్ని కర్ణాటక బీజేపీ నాయకులు గ్రహించారన్న సంగతి వారిని కలుసుకున్నప్పుడు నాకు అవగాహనకు వచ్చింది. దీనితోనే కన్నడిగ అస్తిత్వం కోసం కాంగ్రెస్ ఏ విధంగా పాటు పడుతున్నదో తాము కూడా అదే విధంగా పాటు పడతామన్న రీతిలో బీజేపీ వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిందీ, కన్నడ భాష అంశం ఈ స్థాయికి చేరుకోవడం శోచనీయం. ఇదే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య నిధుల కేటాయింపు వివాదంలో ప్రతిఫలిస్తున్నది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర నిధులను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. దీనికి సిద్ధరామయ్య ఇచ్చిన సమాధానం ఇది– కేంద్రానికి కర్ణాటక పన్నుల రూపంలో చెల్లిస్తున్న ప్రతి రూపాయికి తిరిగి పొందుతున్నది 47 పైసలేనని అన్నారు. ఉత్తరాది బీమారు రాష్ట్రాలు (బిహార్, ఎంపీ, రాజస్తాన్, యూపీ) తమ తమ పరిధుల లోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిధుల కోసం తల్లడిల్లు తుండగా, వాటికి కర్ణాటక రాయితీలు కల్పిస్తున్నదని సిద్ధరామయ్య ఇక్కడ చెప్పదలిచారు. ఈ ఎన్నికలు కొన్ని చేదు వాస్తవాలను మనముందు పెడుతున్నాయి. ఎక్కువగా మాట్లాడని కర్ణాటక రాష్ట్రానికి బియ్యం సబ్సిడీని తగ్గిం చడం, గోరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రానికి ఆ సబ్సిడీని కేటాయించడం ఎంతవరకు సబబు? ఇది ఉత్తర భారత, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య వివక్ష చూపించడం కాదా? ఈసారి కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ఆ రాష్ట్ర ప్రజలకు పరీక్ష వంటివని నాకు అనిపిస్తున్నది. వారి అస్తిత్వానికి, వారి ఆత్మ గౌరవా నికి, వీటిలో వారు దేనిని ఆహ్వానించారు, దేనిని తిరస్కరించారన్నదానికి వారి ఎంపిక వ్యాఖ్యానం వంటిది. అలాగే ఈ విషయాలతో సంబంధం ఉన్న వారందరూ ఈ ఎన్నికల నుంచి నేర్చుకోవాలి. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి
మైసూరు: కన్నడ భాష, నేల, నీటి విషయాల్లో పార్టీలకు అతీతంగా పోరడడానికి తాము ఎల్లపుడూ సిద్ధంగానే ఉన్నామని నదీ జలాల పంపిణీ వివాదంలో తమపై విమర్శలు చేసేటపుడు సీఎం సిద్దరామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. నీటి వివాదాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తుండిపోయామంటూ సీఎం సిద్దరామయ్య తమపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలన్నారు. కావేని నదీ జలాల పంపిణీ విషయంలో సీఎం సిద్దరామయ్య కోరిన ప్రతీసారీ రాష్ట్రం తరపున ఉద్యమాల్లో పాల్గొన్నామన్నారు. తాజాగా జరుగుతున్న మహదాయి నదీ జలాల పంపిణీ వివాదంపై కూడా పార్టీలకు అతీతంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం సిద్దరామయ్య కోరితే మహదాయిపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తామన్నారు. తమపై విమర్శలు చేసే సమయంలో సీఎం సిద్దరామయ్య స్థితప్రగ్ఞతో వ్యవహరించాలని ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు విమర్శలు, ఆరోపణలు మానేసి నదీ జలాల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.తమపై విమర్శలు చేసే ముందు తాము కృష్ణ నది జలాలపై కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రానికి అనుకూలంగా పథకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇక గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో హాసన్ రైల్వేస్టేషన్ గురించి చర్చించడానికి మాత్రమే సమావేశమయ్యామని సమావేశంలో రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగపట్టణం, మళవళ్లి, శ్రీరంగంలలో ఉన్న ఆదిరంగ, మధ్య రంగ, అంత్యరంగ దేవాలయాల్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్!’
బెంగళూరు: ఉత్తర బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నడ భాష రానందుకు ఓ మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టి చేయిచేసుకొని అసభ్యంగా తాకారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆమె తన స్నేహితురాలు రాత్రి 9.30గంటల ప్రాంతంలో తమ ఇంటికి తిరిగొస్తుండగా వారితో ఓ వీధిలో కొంతమంది గొడవపడ్డారు. వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. వారి వద్దకు వచ్చి కన్నడంలో ఏదైనా మాట్లాడాలని అడిగాడు. అనంతరం కన్నడ భాషలోనే వారిని ఏదో అనకూడని మాటలు అన్నాడు. అది వారికి అర్థం కాకపోవడంతో మిగితావారు కూడా వారి వద్దకు వచ్చి కర్ణాటకలో తింటూ కర్ణాటకలో ఉంటూ ఎందుకు కన్నడం మాట్లాడలేకపోతున్నారని తిట్టారు. ‘మీరు స్థానికులు కాదు. మీకు కన్నడ ఎలా మాట్లాడాలో తెలియదు. అందుకే మీరు మొకాళ్లపై కూర్చుని క్షమించాలని ప్రార్థించండి లేదంటే లైంగికదాడి చేసి వేధిస్తాం అని బెదిరించారు. నాకు ఈ నగరంలో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతాను’ అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకల్లో పెద్ద మొత్తంలో లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకున్న అనంతరం జరిగిన ఈ విద్వేషపూరిత ఘటన కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. -
కన్నడపై నిర్లక్ష్యం సరికాదు
ప్రధానితో సమావేశానికి నేతృత్వం వహించేందుకు సిద్ధం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ బెంగళూరు : రాష్ట్రంలో కన్నడ భాషను పాలనా వ్యవహారాల భాషగా మార్చడంతో పాటు కన్నడ మాధ్యమంలో శిక్షణను తప్పనిసరి చేసే విధంగా విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మంత్రులు, ఎంపీలు చర్చించేందుకు ముందుకు వస్తే ఈ సమావేశానికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బెంగళూరు మహానగర రవాణా సంస్థ, కన్నడ సాహిత్య పరిషత్‌తో కలిసి శనివారమిక్కడి శిక్షకర సదనలో నిర్వహించిన ‘నృపతుంగ సాహిత్య అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవడం ద్వారా కన్నడ భాష, సంస్కృతిల రక్షణలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఎక్కడికి వెళ్లినా, ఏ ఒప్పంద పత్రాలపై సంతకం చేసినా అది తప్పక కన్నడ భాషలోనే ఉంటుందని, ఇందుకు తానెంతగానో గర్వపడుతున్నానని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. కాగా ప్రస్తుతం కొంతమంది అఖండ కర్ణాటకను విభజించాలని చూస్తున్నారని, అయితే ఇది ఎవరి వల్ల సాధ్యం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, కన్నడ అభివృద్ధి మండలి అధ్యక్షుడు డాక్టర్ ఎల్.హనుమంతయ్య, బీఎంటీసీ మేనేజింగ్ డెరైక్టర్ ఏక్రూప్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. -
నిత్యానందా... ఏమిటిదంతా?
నిత్యా'ఆనందం'లో మునిగితేలే స్వాములోరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శిష్యురాళ్ల 'అంతరంగిక సేవ'తో తరించే ఈ స్వయంప్రకటిత దేవుడికి పట్టరాని కోపం వచ్చింది. తన ప్రవచనాలతో భక్తులకు జ్ఞానబోధ చేసే ధ్యాన పీఠాధిపతి ఒంటికాలిపై లేచారు. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అలగా జనంపై స్వాములోనే చెణుకులు విసిరి చిక్కుల్లో పడ్డారు. అయినా చిక్కుల్లో పడడం చాకచక్యంగా తప్పించుకోవడం నిత్యానందుల వారికి 'వీడియో'తో పెట్టిన విద్య. అనుంగు శిష్యురాలు రంజితతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రెచ్చకెక్కినప్పడు స్వాములోరు చూపిన సాహసం నిరూపమానం. తన దగ్గర 'విషయం' లేదని... విషయం లేకుండా వ్యవహారం ఎలా సాధ్యమంటూ ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో అంతవరకు స్వామిపై ఉన్న కోపం తగ్గిపోయి జాలి కలిగింది. 'రంజిత'నందాన్ని కొంతకాలం పక్కనపెట్టి పర్వత ప్రాంతాలకు పోతే అక్కడ కూడా స్వామలోరికి సుఖం లేదు. నిత్యానందుడు పర్వత సరస్సుల్లో విహరిస్తున్నారని ఛాయా చిత్రాలతో బయటపెట్టింది పాడులోకం. అన్ని మర్చిపోయి హాయిగా భక్తులతో కాలక్షేపం చేస్తున్న సర్వసంగ పరిత్యాగిని మళ్లీ యాగీ చేయడం న్యాయమా? అందుకో కాబోలు స్వామిలోరికి అంత కోపం వచ్చింది. కన్నడ భాష పేరిట తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారంతా డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 300 రూపాయల కోసం ఆశపడి మూడు గంటల ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి వారికి తనపై కోపం లేదని జాలి చూపారు. ఉద్యమానికి నేతృత్వం వహించే వారే కార్యకర్తల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పరమ సత్యం వెల్లడించారు. నిత్యానందుల వారికి అంతా అలా తెలిసిపోతుటుంది మరి! -
తమిళంలో ప్రభుత్వ పథకాల ప్రచారం
అర్థం కాక బిక్క మొహం వేస్తున్న మైనార్టీ భాషల ప్రజలు హొసూరు, న్యూస్‌లైన్ : కృష్ణగిరి జిల్లాలో ప్రభుత్వ పథకాల తీరు నేల విడిచి సాము చేసే చందంలా తయారైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమిళంలో ప్రచారం చేస్తుండడంతో కన్నడ భాషా ప్రజలకు అర్థం కావడం లేదు. దీంతో వాటి ఫలాలు ప్రజలకు చేరక పోగా, కొన్ని పథకాల నిధులు దుర్వినియోగం అవుతుండడంతో పాటు నిరుపయోగమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని హొసూరు, డెంకణీకోట, కృష్ణగిరి తాలూకాలలో తెలుగు, కన్నడ భాషా ప్రజలు ఎక్కువ. ఇక్కడ నివసించే వారిలో 80 శాతం మందికి తమిళం తెలియదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాన నీటి సేకరణ పథకం అమలుకు ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించి వర్షపు నీటి సేకరణ పనులు చేపట్టి భూగర్భ జల వనరుల పెంపునకు కృషి చేయాలని సీఎం సూచించారు. దీంతో కలెక్టర్ టీపీ.రాజేష్ వెంటనే స్పందించి పాఠశాల విద్యార్థులతో ఊరేగింపులు, కలెక్టర్ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో 20 చోట్ల, పట్టణ పంచాయతీల్లో 15 చోట్ల ఫెక్సీలు ఏర్పాటు చేయాలని, వాన నీటి సేకరణపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అధికారులు కూడా.. జీ హుజూర్.. అంటూ కూడా తలలు ఊపి తమిళ అక్షరాలతో అందంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణ పంచాయతీల్లోని తెలుగు, కన్నడ ప్రజలు వీటిని చూసి ఏమీ అర్థంకాక తెల్లముఖం వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లాలంటే ప్రజల భాషల్లో ప్రచారం చేయాలని సమీక్షా సమావేశాల్లో అధికారులు తెలిపాలి లేదా, జిల్లా కలెక్టర్ ఆలోచించి నిర్ణయించాల్సి ఉంది. ఈ విషయంపై తెలుగు సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షుడు ఎంఎస్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లను తెలుగు, కన్నడ భాషల్లో ముద్రించి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం, ప్రభుత్వ పథకాల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. అధికారులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పని చేయాలని, ప్రజల కోసం పని చేయాలని ఆయన సూచించారు. -
కుటుంబం సహా వాటాళ్ పార్టీ నేత ఆత్మహత్య
*భార్య, కుమారుడు, కుమార్తెతో ఇంటిలోనే ఆత్మహత్య * 20 ఏళ్లు కన్నడ భాష కోసం పోరాటం చేసిన నాయకుడు * వాటాళ్ నాగరాజ్‌కు కుడిభుజం బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆర్థిక ఇబ్బందులతో కన్నడ చళువళి పార్టీ కీలక నాయకుడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇక్కడి బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బయ్యప్పనహళ్ళిలోని నాగవరపాళ్యలో నివా సం ఉంటున్న వాటల్ పక్ష పార్టీ నాయకుడు గోపి అలియాస్ నా. గోపి (44), ఆయన భార్య జయశ్రీ (38), వీరి కుమారుడు దిలీప్ (18), కుమార్తె సంగీత అలియాస్ సంజన (15) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం గోపి కుటుంబ సభ్యులు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో చుట్టు పక్కల వారు, బంధువులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. గోపి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్‌నోట్ రాసిపెట్టారని తెలిసింది. అయితే అందులోని వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఆర్థిక సమస్యల కారణంగా గోపి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు తెలిపారు. వాటాళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు వాటాళ్ నాగరాజ్‌కు గోపి కుడి భుజం. వాటాళ్ నాగరాజ్ ఎప్పుడు పోరాటం చేసినా గోపి కీలకంగా వ్యవహరించేవాడు. రెండుసార్లు శాసన సభ ఎన్నికలలో పోటీ చేసిన గోపి ఓటమి చెందాడు. వాటాళ్ నాగరాజ్‌కు అన్ని తానై చూసుకునే గోపి గత 10 రోజుల క్రితం బయ్యప్పనహళ్లిలో ఉదయం నుంచి రాత్రి వరకు కన్నడ రాజ్యోత్సం జరిపించారు. ఈ కార్యక్రమానికి వాటాళ్ నాగరాజ్‌తో సహ పలు కన్నడ సంఘాల నాయకులు హాజరయ్యారు. బుధవారం ఆయన ప్రజా సమస్యలపై పోరాటానికి 20 ఏళ్లు పూర్తి అయ్యింది. ఆ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గోపి ఆనందంగా గడిపారు. అదే సమయంలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే తన చివరి పార్టీ అని స్నేహితుడు రూపేష్‌తో గోపి చెప్పినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే ఈ దారుణం జరిగిపోయిందని రూపేష్‌తో సహ ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపి, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంతోనే గోపి కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.