‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్‌!’ | Woman molested, slapped as she couldn't speak Kannada | Sakshi
Sakshi News home page

‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్‌!’

Published Mon, Mar 20 2017 5:23 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్‌!’

‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్‌!’

బెంగళూరు: ఉత్తర బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నడ భాష రానందుకు ఓ మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టి చేయిచేసుకొని అసభ్యంగా తాకారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆమె తన స్నేహితురాలు రాత్రి 9.30గంటల ప్రాంతంలో తమ ఇంటికి తిరిగొస్తుండగా వారితో ఓ వీధిలో కొంతమంది గొడవపడ్డారు. వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. వారి వద్దకు వచ్చి కన్నడంలో ఏదైనా మాట్లాడాలని అడిగాడు.

అనంతరం కన్నడ భాషలోనే వారిని ఏదో అనకూడని మాటలు అన్నాడు. అది వారికి అర్థం కాకపోవడంతో మిగితావారు కూడా వారి వద్దకు వచ్చి కర్ణాటకలో తింటూ కర్ణాటకలో ఉంటూ ఎందుకు కన్నడం మాట్లాడలేకపోతున్నారని తిట్టారు. ‘మీరు స్థానికులు కాదు. మీకు కన్నడ ఎలా మాట్లాడాలో తెలియదు. అందుకే మీరు మొకాళ్లపై కూర్చుని క్షమించాలని ప్రార్థించండి లేదంటే లైంగికదాడి చేసి వేధిస్తాం అని బెదిరించారు. నాకు ఈ నగరంలో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతాను’  అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. న్యూ ఇయర్‌ వేడుకల్లో పెద్ద మొత్తంలో లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకున్న అనంతరం జరిగిన ఈ విద్వేషపూరిత ఘటన కాస్తంత ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement