
దొడ్డబళ్లాపురం: టోల్ ఫీజు అడిగితే ఓ రైతు కొడవలి అందించాడు. ఈ ఘటన బెంగళూరు సమీపంలో చోటు చేసుకుంది. బెంగళూరు–హైదరాబాద్ మార్గంలోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో ఏర్పాటు చేసిన టోల్‌గేట్ వద్దకు గురువారం ఉదయం ఓ వ్యక్తి కారులో రాగా టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది అడిగారు. తాను స్థానికుడినని, రైతునని, పొలం పనికి వెళ్లి వస్తున్నానని చెప్పాడు.
అయితే ఆయన లగ్జరీ కారులో రావడాన్ని బట్టి రైతు కాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యక్తి కారులో ఉన్న కొడవలి తీసి సిబ్బంది చేతికిచ్చి ఇప్పుడయినా నమ్ముతారా అని ప్రశ్నించారు. భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా చిక్కజాల పోలీసులు ఆయన్ను పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లారు. ఆయన స్థానిక రైతు అని తేలడంతో వదిలేశారు.
చదవండి: ఆ ఉద్యోగం వద్దు.. పంజాబ్ ఎమ్మెల్యే స్పష్టీకరణ
Comments
Please login to add a commentAdd a comment