
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవానులు మృతి చెందగా, ఆర్మీకి చెందిన ఆరుగురితోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నాగ్‌పూర్‌లోని కన్హాన్ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఆటో, బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఇద్దరు జవానులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు సైనికులతో పాటు ఆటో డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా తొమ్మది మంది ఉన్నారు. ఈ ఆర్మీ సిబ్బంది కమతిలోని గార్డ్ రెజిమెంట్ సెంటర్‌కు చెందినవారు. ఈ ప్రమాదంపై న్యూ కమతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment