
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తిరుపతికి వెళ్లి ప్రొద్దుటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో మృతి చెందిన వారిని అనూష (35), ఓబుళమ్మ (50), రామలక్ష్మి (55) గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.