
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్‌మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కారులో ఇరుక్కుపోయినవారిని బయటకు తీశారు. క్షతగాత్రులను తరలించారు. ట్రక్కు నాగాలాండ్‌కు చెందినది కాగా.. కారు జార్ఖండ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
Comments
Please login to add a commentAdd a comment