
చురు: రాజస్తాన్‌లో చురు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల నిమిత్తం వెళ్తున్న ఆరుగురు పోలీసు సిబ్బంది ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు.
వారంతా నగౌర్ నుంచి ఎన్నికల ర్యాలీ జరగనున్న ఝుంఝును వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు దట్టమైన పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దాంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment