వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.
నర్సింహులపేట: వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నల్లగొండ జిల్లా కుక్కడం గ్రామానికి చెందిన కొండా భిక్షం (30), రామ్మూర్తి (28) పనుల నిమిత్తం శనివారం వరంగల్ జిల్లా దంతాలపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా... నర్సింహులపేట మండలం కుమ్మరికుంట్ల గ్రామం శివారులోని పాలేరు వాగు వద్ద సూర్యాపేట వైపు నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో భిక్షం, రామ్మూర్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.