
సాక్షి, మొయినాబాద్ (రంగారెడ్డి): రెండేళ్ల క్రితం భర్త.. ప్ర స్తుతం భార్యను ఒకే బావి బలితీసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి పంచాయతీ అనుబంధ గ్రామం చాకలిగూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం చాకలిగూడకు చెందిన దగ్గుల వినోద (30) మంగళవారం పనిచేయంకోసం వ్యవ సాయ పొలం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న బావిలో ప్రమాదవశాత్తు జారిపడింది.
ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను గమనించలేదు. మంగళవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. బంధువులకు ఫోన్ చేసి వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో గురువారం బావిలో వినోద మృతదేహం తేలి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రెండేళ్ల క్రితం వినోధ భర్త శ్రీనివాస్ కూడా అదే బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment