ప్రతీకాత్మక చిత్రం
మొయినాబాద్/రంగారెడ్డి: మరో రెండు గంటల్లో వివాహం... ఇళ్లంతా పెళ్లి సందడి.. కుటుంబ సభ్యులు, బంధువులంతా ముస్తాబవుతున్నారు.. పెళ్లి కూతురును ముస్తాబు చేస్తున్నారు.. ముత్యాల పందిరి సిద్ధం చేశారు.. భోజనాలకోసం వంటలు సిద్ధమవుతున్నాయి... అంతలోనే పెళ్లివారి ఇంటి ముందుకు పోలీసులు, అంగన్‌వాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వచ్చి బాలిక పెళ్లిని అడ్డుకున్నారు. మండల పరిధిలోని సురంగల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక(14)కు పెళ్లి జరుగనుందని ఆదివారం ‘సాక్షి’ దిపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.
ఆదివారం ఉదయం 8గంటలకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భారతి, పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సురంగల్ గ్రామానికి వచ్చారు. స్థానిక సర్పంచ్ గడ్డం లావణ్య, అంగన్‌వాడీ టీచర్లతో కలిసి బాలిక ఇంటికి వెళ్లారు. బాలిక తల్లితోపాటు బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లి ఆపారు. బాలికతోపాటు ఆమె తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయవద్దని సూచించారు. బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ‘సఖి’ కేంద్రానికి తరలించారు.
(చదవండి: ప్రియుడి కోసం.. ఆస్తమా మందులు మార్చేసి భర్తను దారుణంగా)
Comments
Please login to add a commentAdd a comment