
తెలంగాణలో ఉన్న ప్రభుత్వం, నాయకులు.. ప్రజాస్వామ్యానికి శాపం అని..
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై కర్ణాటక నేత, బీజేపీ సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నగరంలో జరిగిన బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి, విస్తారక్, పాలక్, కన్వీనర్‌ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన.
నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఆరోపణలు చేసిన వాళ్లు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదు. నేనంటే ఎవరికీ తెలియదు. కానీ, తెలంగాణలో ప్రతీ ఇంటికి నా పేరు తీసుకెళ్లారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారు.
ఇక్కడున్న ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు దేశమంతా డబ్బులు పంపుతున్నారంటూ విమర్శించారాయన.