సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. 24 గంటల్లోగా నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే.. ఆ వెంటనే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన మరో బెంచ్.. దర్యాప్తుపై స్టే విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
చదవండి: (దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక)
Comments
Please login to add a commentAdd a comment