మొయినాబాద్‌ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య | Moinabad: Drunk youth Rams Car Into Scooter, Two Teen Died | Sakshi
Sakshi News home page

Drunk and Drive: మొయినాబాద్‌ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య

Dec 27 2021 11:52 AM | Updated on Dec 27 2021 2:02 PM

Moinabad: Drunk youth Rams Car Into Scooter, Two Teen Died - Sakshi

సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకీ హద్దు మీరుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు తాగి కార్లు బైకులు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి తాజాగా వీరి కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తాజ్ హోటల్ సమీపంలో సౌమ్య, ప్రేమిక, అక్షయ ముగ్గురు యువతులు కనకమామిడి వైపు వెళుతున్నారు.

అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నకారు, ఎదురుగా వచ్చిన వీరి స్కూటీని ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక(16) సంఘటన స్థలంలోనే చనిపోగా.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సౌమ్య(18) కూడా మృతి చెందింది. ప్రస్తుతం అక్షర(14) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరు ముగ్గురు  ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు.
చదవండి: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టడంతో..

ఈ ప్రమాదం కారణంగా బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు బోరున విలపించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్యం సేవించి కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement