girls died
-
విహారయాత్రలో విషాదం.. అమ్మాయిలు మృతి
సరదా కోసం వెళ్లిన విహారయాత్ర విద్యార్థులకు విషాదాన్ని నింపింది. వాటర్‌ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేసే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నలుగురు విద్యార్థినిలు మృత్యువాతపడగా.. మరో యువతి ప్రాణాల కోసం ఆసుప్రతిలో పోరాడుతోంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కర్నాటలోని బెలగావికి చెందిన 40 మంది విద్యార్థినిలు పిక్నిక్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో టూర్ కోసం మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా కొల్హాపూర్ జిల్లాలోని కిట్వాడ్ వాటర్‌ఫాల్స్ వద్దకు చేరుకున్నారు. అనంతరం, యువతుందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో మృత్యువు వారిని వెంటాడింది. విద్యార్థినిలు సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఐదుగురు యువతులు అదుపుతప్పి జలపాతంలో పడిపోయారు. ఈ క్రమంలో నలుగురు యువతులు మృతిచెందగా.. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది మరో యువతిని కాపాడారు. కానీ, ఈ ప్రమాదంలో సదరు యువతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే బెలగావిలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, మృతిచెందిన వారిని ఆసియా ముజావర్(17), కుద్రషియా హసమ్ పటేల్(20), రుక్కాషా భిస్తీ(20), తాస్మియా(20)గా గుర్తించారు. వీరి మృతి కారణంగా విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా ముగిసింది. Maharashtra: 4 college girls drown while clicking selfies at Kitwad waterfall in Kolhapur https://t.co/4dlwRCdYmP — TOI Cities (@TOICitiesNews) November 26, 2022 -
మొయినాబాద్ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకీ హద్దు మీరుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు తాగి కార్లు బైకులు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి తాజాగా వీరి కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తాజ్ హోటల్ సమీపంలో సౌమ్య, ప్రేమిక, అక్షయ ముగ్గురు యువతులు కనకమామిడి వైపు వెళుతున్నారు. అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నకారు, ఎదురుగా వచ్చిన వీరి స్కూటీని ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక(16) సంఘటన స్థలంలోనే చనిపోగా.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సౌమ్య(18) కూడా మృతి చెందింది. ప్రస్తుతం అక్షర(14) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. చదవండి: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టడంతో.. ఈ ప్రమాదం కారణంగా బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు బోరున విలపించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్యం సేవించి కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
అయ్యో.. దేవుడా ఎంత ఘోరం!
‘అయ్యో.. దేవుడా! ఇంత ఘోరమా.. ముక్కుపచ్చలారని మా పిల్లలు ఐదుగురిని ఒకేసారి తీసుకునిపోతివా..’ అంటూ బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలచివేసింది. మల్దకల్మండలం నాగర్‌దొడ్డికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు చిన్నారులు సోమవారం సాయంత్రం ఆడుకుంటూ శివారులోని రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడి బావి గుంతలో పడి మృత్యువాత పడటంతో విషాదం అలుముకుంది. ఉదయం ఎంచక్కా స్కూలుకు వెళ్లొచ్చారు. సాయంత్రం కాసేపు రిజర్వాయర్ నీటిలో ఆడుకుందామని ఆవుతోపాటు వెళ్లడమే.. ఆ చిన్నారుల జీవితాలకు నిండునూరేళ్లు నిండేలా చేసింది. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్త బాబూ.. అంటూ చెప్పే తల్లిదండ్రులు ఊహించలేదు ఆ చిన్నారులకు కానరాని లోకాలు వెళ్తారని... మృత్యువు ఎప్పుడు ఏ విధంగా వెంటాడుతుందో చిన్నారులు పసిగట్టలేకపోయారు. అందరూ చిన్నపిల్లలు కావడంతో.. అప్రమత్తం కాలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరిని వరుసగా ఐదుగురిని నీటిగుంట మింగేసింది. ఈ దుర్ఘటన మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామాన్ని విషాదంలోకి నెట్టేసింది. బాధిత కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. మల్దకల్ (గద్వాల) : మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలోని బావి గుంతలో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృత్యువాత పడ్డారు. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన బాలికలు కాగా, మరో ఇద్దరు బాలికలు ఇతర కుటుంబాలకు చెందిన వారు. నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప, మాణిక్యమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో యుమున(12), చిన్నారి(11), వెంకటేశ్వరి (10) మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో చిన్నారి (8) మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన చిన్న కుర్వ వెంకటేష్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కవిత(11) మృతిచెందిన వారిలో ఉన్నారు. సరదానే ప్రాణాలమీదికొచ్చింది.. చిన్నారులంతా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఒంటిపూట బడులు కావడం, చిన్నారులంతా ఆటల్లో మునిగి తేలారు. ఈ క్రమంలో సాయంకాలం కావడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆవును దగ్గరలో ఉన్న పొలాల వద్ద మేపేందుకు తీసుకెళ్లారు. ఈ సంతోషమే వారిని మృత్యు ఒడిలోకి చేర్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంకాలం సుమారు 4.30గంటల ప్రాంతంలో ఆవుతో పాటు ఐదుగురు చిన్నారులు వెళ్లారు. చివరగా గంటన్నర వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులంతా కూడా దినసరి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకోగానే పిడుగులాంటి వార్త విని నిశ్చేష్టులయ్యారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చిన్నారులను పాఠశాలకు పంపించేవారు ఆ తల్లిదండ్రులు. నిరక్షరాస్యులైన కుటుంబాలకు అక్షర జ్యోతులను వెలిగిద్దామని బుడి బుడి అడుగులు వేసిన బాల్యానికి బావిగుంత మృత్యుపాశమవగా.. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. తాము ఇంటికి వెళ్లగానే ఏం తెచ్చావనే ప్రశ్నించే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో గుండెలు బాదుకొని రోదించారు. ఆ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఇక తోటి స్నేహితులు సైతం తమ స్నేహితులు లేరని తెలుసుకొని దీనస్థితికి చేరుకున్నారు. ప్రముఖుల పరామర్శ ఐదుగురు చిన్నారులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, ఎస్పీ లక్ష్మీనాయక్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, సర్పంచ్ బండ్ల జ్యోతి, డీఎస్పీ షాకీర్‌హుసేన్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబాలను ఆదుకుంటామని చిన్నారుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సంఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మల్దకల్ ఎస్ఐ కృష్ణ ఓబుల్‌రెడ్డి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆవుతోక పట్టుకొని వెళ్లి.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూలానే సోమవారం గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు వెళ్లారు. అందరూ కూడా ఇంచుమించు ఒకే వయస్సు గల చిన్నారులు కావడంతో కలిసి మెలిసి ఆడుకునేవారు. సాయంత్రం 5గంటల సమయంలో గ్రామ సమీపంలోని రిజర్వాయర్‌లోని ఆడుకునేందుకు బయల్దేరారు. అరకొర నీటిలో ఆడుకుంటూ ముందుకు సాగారు. అయితే కుమ్మరి ఎల్లప్పకు చెందిన ఆవును కూడా వారితో పాటే తీసుకెళ్లారు. అక్కడ లోతుగా ఉన్న పెద్ద గుంత ఉంది. అది గమనించని చిన్నారులు అలాగే ఆవుతో పాటు నీటిలో నడుస్తూ వెళ్లారు. ప్రమాదవశాత్తు ఐదుగురు చిన్నారులు పెద్ద గుంతలో పడిపోయారు. పడిన వెంటనే పెద్ద ఎత్తున కేకలు వేసినా చుట్టు ప్రక్కల ఎవరూ లేకపోవడంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు. చిన్నారులకు ఈత రాకపోవడం, నీటిలో ఊపిరాడక మృతి చెందారు. తెలిసిందిలా.. ఇదిలాఉండగా, మృతిచెందిన చిన్నారి యమున తండ్రి ఫోన్ ఇంట్లో ఉండడంతో ఫోన్ కూడా తనతో పాటే తీసుకెళ్లింది. ఈ ఫోన్ ప్రమాదం జరిగిన నీటి గుంత ఒడ్డుపైనే ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రైతు కుమ్మరి ఎల్లప్పకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికీ ఎత్తకపోవడంతో ఆ రైతు ఇంటివద్దకు వెళ్లి ఫోన్ ఎత్తడం లేదని ప్రశ్నించాడు. ఫోన్ తన వద్ద లేదని వివరించాడు. అయితే మీ ఆవు వ్యవసాయ పొలం వద్ద ఉందని, మీ పిల్లలు ఎక్కడున్నారనే మాట కలిపాడు. దీంతో హుటాహుటిన ఆవుతో పాటే పిల్లలు వెళ్లారని గ్రహించి అక్కడికి చేరుకున్నారు. ఫోన్ ఒడ్డుపైనే ఉండటం చూసి ఖంగుతిన్నారు. అటూ ఇటూ వెతకసాగారు. ఒకవేళ గుంతలో పడ్డారేమోనన్న అనుమానంతో గుంతలోకి దిగి వెతకగా చిన్నారుల మృతదేహాలు ఒక్కొక్కటికి బయట పడ్డాయి. అయితే కవిత మృతదేహం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇక మరోసారి స్థానికుల సాయంతో వెతకగా రాత్రి 8గంటల ప్రాంతంలో కవిత మృతదేహం లభ్యమైంది. -
నిద్రలోనే పరలోకానికి..
ఇద్దరు చిన్నారులను బలిగొన్న గోడ రామాయంపేట: ఓ గోడ ఇద్దరు చిన్నారులను పొట్టన పెట్టుకుంది. అప్పటివరకు అంతా ఉల్లాసంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకున్నారు. భోజనం చేసి తమ పూరి గుడిసెలో నిద్రపోయారు. తెల్లారేసరికి గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కళ్లెదుటే కన్న కూతుళ్లను కోల్పోయిన వారు అంతులేని ఆవేదనకు లోనయ్యారు. వారి రోదన తండా వాసులను సైతం కంటతడిపెట్టించింది. వివరాలు ఇలా... రామాయంపేట మండలం నస్కల్ పరిధిలోని నగరం తండాకు చెందిన బానోత్ లాలూ, కంలీ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. ఆ తరువాత తమ పూరిగుడిసెలో నిద్రపోయారు. ఆదివారం తెల్లవారు జామున అకస్మాత్తుగా గోడ కూలడంతో పెద్ద కూతురు మౌనిక (9), చిన్న కూతురు గీత(5) తీవ్రంగా గాయపడ్డారు. కంలితోపాటు కుమారుడు చందుపై పెళ్లలు పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రఆందోళకు గురైన లాలూ వెంటనే తండాలోని ఆటో డ్రైవర్‌ను లేపి ఇద్దరు పిల్లల ను చికిత్స నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలిం చాడు. అప్పటికే మౌనిక(చిట్టి), గీత మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అదే ఆటోలో మృత దేహాలను తం డాకు తరలించారు. విషయం తెలుసుకొన్న గిరిజనులు, పరిసర గ్రామాల ప్రజలు తండాకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనితో తండాలో విషాదం నెలకొంది. కన్నీరు మున్నీరైన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుడిసె గోడ పూర్తిగా తడవడం వల్లే కూలినట్టు తెలిసింది. ఉన్న ఇద్దరు కూతుళ్లను కోల్పోయి.. భానోత్ లాలూ, కంలి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. కాగా ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లను పోగొట్టుకున్నారు. పెద్ద కూతురు చిట్టి అలియాస్(9) నాలుగో తరగతి చదువుతుంది. రెండో కూతురు గీత(5) అంగన్వాడీ కేంద్రంలో చదువుతుంది. కుమారుడు చందు అందరికంటే చిన్నవాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: పద్మ నగరం తండాలో జరిగిన ఘటనను తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానిక ఎంపీపీ పుట్టి విజయల క్ష్మి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి తదితరులు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.5వేల నగదు ఆర్థిక సాయాన్ని అందజేశారు. వారి వెంట పుట్టి యాదగిరి, బిజ్జ సంపత్, అందె, బాజ చంద్రం, మన్నె జలంధర్, టీఆర్ఎస్ నందిగామ అధ్యక్షుడు బుచ్చ నర్సింలు, కన్న అంజాగౌడ్ తదితరులు ఉన్నారు. -
మెదక్‌లో బాలికలు మృతి
రామాయంపేట: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామాయంపేట మండలం నగరంతండాలో శనివారం రాత్రి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. గత రెండు రోజులుగా మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. పాత గోడ కూలింది. ఆ సమయంలో అక్కడే నిద్రిస్తున్న గీత(7), చిట్టి(10) అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కేసీకెనాల్లో పడి అక్కాచెల్లెళ్లు మృతి
ప్రమాద వశాత్తు కేసీకెనాల్ లో పడి ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన ఆలంపూర్ మండలం ర్యాలంపాడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. ర్యాలంపాడు గ్రామానికి చెందిన సాలెహ(14), సాదిత(10) కేసీకెనాల్ వద్ద బట్టలు ఉతుకుతుండగా పొరపాటున బకెట్ కెనాల్లో పడిపోయింది. బకెట్ కోసం అక్క నీళ్లలో దిగగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. అక్కను కాపాడబోయి చెల్లెలు సాజిత కూడా మునిగిపోయింది. చెల్లెలు సాదిత మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. అక్క సాలెహ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతోన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
చెరువులో పడి ఇద్దరు బాలికల మృతి
వరంగల్: చేపల వేటకు వెళ్లిన ఇద్దరు బాలికలు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం శేనగకుంట గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. శేనగకుంట గ్రామానికి చెందిన మూడో తరగతి చదివే మంకిడి శృతిలయ(8), నాలుగో తరగతి చదివే యాలం శ్వేత(9)లు చెరువులో చేపల వేటకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లారు. సాయంత్రం పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించలేదు. దీంతో వారి ఆచూకి కోసం గాలించారు. చెరువు వైపు వెళ్లినట్లు కొంత మంది గ్రామస్థులు చెప్పారు. ఈ క్రమంలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు రాత్రి వేళ చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి చెరువులో ఇద్దరు బాలికల శవాలను గ్రామస్థులు గుర్తించారు. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. (మంగపేట)